రాష్ట్రంలో కోటి ఎకరాల మాగాణ లక్ష్యం.. ముఖ్యమంత్రి కేసీఆర్ కల సాకారమైంది. తెలంగాణ ఆవిర్భావం అనంతరం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వ్యవసాయ అనుకూల విధానాల నేపథ్యంలో అనతికాలంలో సాగులో మంచి పురోగతి కనిపిస్తోంది. రైతుల సౌకర్యార్థం... ఈ ఏడాది వానాకాలంలో రైతుబంధు పథకం కింద ఏకంగా కోటి 50 లక్షల 12,603 ఎకరాలకు 5 వేల రూపాయల చొప్పున పెట్టుబడి సాయం అందించినట్లు వ్యవసాయ శాఖ తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది.
రైతుబంధు నివేదిక విడుదల చేసిన వ్యవసాయ శాఖ! - రైతుబంధు నివేదిక విడుదల చేసిన వ్యవసాయ శాఖ!
రాష్ట్రంలో రైతుబంధు పథకం కింద పెద్ద ఎత్తున రైతులకు పెట్టుబడి సాయం అందించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. సాగుయోగ్యత దృష్యా... ఈ ఏడాది వానాకాలం సీజన్‌లో భూ కమతాలు, యజమానులు, విస్తీర్ణం వారీగా పట్టాదారులకు సాయం అందించింది. మొత్తం కోటి 50లక్షల 12,603 ఎకరాల విస్తీర్ణానికి గల60 లక్షల 95 వేల మంది రైతులకు రైతుబంధు పెట్టుబడి సాయం అందించినట్లు ప్రభుత్వం తెలిపింది. తాజాగా విడుదల చేసిన నివేదికలో వ్యవసాయ భూములకు సంబంధించి వివరాలు, రైతుల సంఖ్య, ఇతర అంశాలను వెల్లడించింది.
రైతుబంధు నివేదిక విడుదల చేసిన వ్యవసాయ శాఖ!