కరోనా పరీక్షల ధరలను తగ్గించిన రాష్ట్ర ప్రభుత్వం - తెలంగాణ కరోనా పరీక్షల వార్తలు
17:42 December 22
కరోనా పరీక్షల ధరలను తగ్గించిన రాష్ట్ర ప్రభుత్వం
కొవిడ్ నిర్ధరణ పరీక్షల రుసుమును రాష్ట్ర ప్రభుత్వం తగ్గించింది. ప్రయోగశాలలు, ఆసుపత్రుల్లో ఆర్టీపీసీఆర్ పరీక్షకు గతంలో ఉన్న రూ.850 రుసుమును రూ.500కు తగ్గించింది. ఇంటి దగ్గర నమూనాలు సేకరించి చేసే పరీక్షల రుసుమును రూ.1200 నుంచి రూ.750కి తగ్గించింది. పీసీఈ కిట్లు, ఇతరత్రాలను కలుపుకొని ఈ ధరలను ఖరారు చేశారు.
కిట్ల లభ్యత పెరగడంతో పాటు పరీక్షా వ్యయం తగ్గిన నేపథ్యంలో కరోనా నిర్ధరణ పరీక్షల ధరలను ప్రభుత్వం తగ్గించింది. ఆసుపత్రులు, ల్యాబులన్నీ కొత్త ధరలను విధిగా అమలు చేయాలన్న ప్రభుత్వం... ఎవరైనా ఉల్లంఘిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇదీ చదవండి :'6 వారాల్లో కరోనా కొత్త స్ట్రెయిన్‌కు టీకా!'