తెలంగాణ

telangana

ETV Bharat / city

ఒకే పాఠం.. రెండు భాషల్లో.. అది కూడా పక్కపక్క పేజీల్లో.. - Teaching in English medium in Telangana

Lessons in Telugu and English: రాష్ట్రంలో ఈ ఏడాది నుంచి విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో భోదన చేయాలని నిర్ణయించిన సర్కారు.. అందుకు తగిన ఏర్పాట్లు చేస్తోంది. అందులో భాగంగానే పాఠ్యపుస్తకాలను కూడా సిద్ధం చేసింది. పిల్లలకు ఎలాంటి ఒత్తిడి లేకుండా.. వినూత్న ప్రయత్నం చేసింది. అదేంటంటే..?

Telangana government printed Lessons in Telugu and English in Academic books
Telangana government printed Lessons in Telugu and English in Academic books

By

Published : Jun 25, 2022, 7:14 AM IST

Lessons in Telugu and English : రాష్ట్రంలోని సర్కారు బడుల్లో ఈ ఏడాది నుంచి 1-8 తరగతుల విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో బోధన చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం.. పాఠశాలల్లో అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే బోధనే కాకుండా.. బోధించాల్సిన పాఠ్యాంశాలు, పాఠ్యపుస్తకాల విషయంలోనూ తగు జాగ్రత్తలు తీసుకుంది. ఒకేసారి ఇంగ్లీష్​ మీడియం అనగానే పిల్లలు ఒత్తిడికి గురవుతారని.. అర్థంకాక ఇబ్బంది పడతారని గ్రహించిన ప్రభుత్వం అలాంటి సమస్యలు రాకుండా వినూత్న ప్రయత్నం చేసింది.

పుస్తకంలో ఒక వైపు ఆంగ్లంలో.. మరో వైపు తెలుగులో పాఠ్యాంశం ఉండేలా అధికారులు ముద్రించారు. ఇలా చేయటం వల్ల.. పిల్లలకు పాఠ్యాంశం సులభంగా అర్థం కావటమే కాకుండా.. వారిపై ఎలాంటి ఒత్తిడి పడకుండా ఉంటుందని భావిస్తున్నారు. ఈ పుస్తకాలను సోమవారం నుంచి విద్యార్థులకు పంపిణీ చేయనున్నట్లు ఉపాధ్యాయులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details