తెలంగాణ

telangana

ETV Bharat / city

Registrations: రాష్ట్రంలో నేటి నుంచి రిజిస్ట్రేషన్​లకు సర్కారు అనుమతి - తెలంగాణ వార్తలు

తెలంగాణ రాష్ట్రంలో లాక్‌డౌన్ సడ‌లింపు నిబంధ‌న‌లు పొడిగించిన నేప‌థ్యంలో రిజిస్ట్రేష‌న్ల‌పై కేబినెట్ నిర్ణ‌యం తీసుకుంది. స‌డ‌లింపు నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా భూములు, ఆస్తులతో పాటు వాహ‌నాల రిజిస్ట్రేష‌న్ల‌కు అనుమ‌తివ్వాల‌ని నిర్ణ‌యించింది.

registrations in telangana
రిజిస్ట్రేషన్​లు

By

Published : May 31, 2021, 12:21 AM IST

రాష్ట్రంలో లాక్​డౌన్ సడలింపుతో (Lockdown Extension)వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లకు(Registrations) ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. స్లాట్ బుకింగ్(slot booking) ద్వారానే రిజిస్ట్రేషన్లు చేయాలని స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖను ఆదేశించింది. ఈ మేరకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ(stamps and Registrations department) మార్గదర్శకాల జారీ చేసింది. నేటి నుంచి స్లాట్‌ బుకింగ్‌ల ద్వారానే ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పనిదినాల్లో(working days) రిజిస్ట్రేషన్లు చేయాలని స్పష్టం చేసింది. ఒక్కొ సబ్​రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రోజుకు 24 స్లాట్లు, ఇద్దరు సబ్‌రిజిస్ట్రార్లు ఉన్న చోట్ల 48 స్లాట్లు లెక్కన స్లాట్ల బుక్ చేసుకోడానికి అవకాశం ఇచ్చింది.

అమ్మకం, కొనుగోలుదారులకు, ఇద్దరు సాక్షులకు ఆన్​లైన్​లొనే పాస్‌ల(online passes) జారీ చేయాలని పేర్కొంది. నిర్దేశించిన సమయం కంటే అయిదు నిముషాలు ముందు సబ్ రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలకు క్రయవిక్రయదారులు చేరుకోవాలని సూచించింది. క్రయవిక్రయదారులు, సాక్షులు మినహా ఇతరులకు కార్యాలయాల్లోకి అనుమతి నిషేధం అని స్పష్టం చేసింది.

ఏ సమయంలోనైనా ఏడుగురికి మించి రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో ఉండరాదని నిబంధనలు విధించింది. ఈసీలు, సీసీలు పూర్తిగా ఆన్‌లైన్‌ ద్వారానే జారీ చెయ్యాలని, కార్యాలయాల్లో జారీ చేయడం పై నిషేధం విధించింది. రిజిస్ట్రేషన్ సమయంలో వేలిముద్రలు తీసుకునేటప్పుడు శానిటైజర్ చేయాలని రిజిస్ట్రేషన్ శాఖ సూచించింది.

సంబంధిత కథనం:Lockdown Extension: రాష్ట్రంలో మరో 10 రోజులు లాక్‌డౌన్ పొడిగింపు

ABOUT THE AUTHOR

...view details