Telangana IT Budget 2022-23 : వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఐటీ ఎగుమతులను రెండు లక్షల కోట్లకు చేర్చడంతో పాటు కొత్తగా 80 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొంది. 2022-23 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ పద్దుల్లో చర్చల్లో భాగంగా ఐటీ శాఖ పురోగతి, లక్ష్యాలను నివేదించింది. 2020-21లో 1,45,522 కోట్ల ఐటీ ఎగుమతులను చేరుకున్నట్లు ఆ శాఖ ప్రకటించింది. కొత్తగా 46 వేల మందికి కొత్తగా ఉద్యోగవకాశాలు వచ్చినట్లు పేర్కొన్న ప్రభుత్వం.. మొత్తం ఐటీ ఉద్యోగుల సంఖ్య 6,28,615కు చేరుకున్నట్లు వెల్లడించింది. 2020-21లో దేశవ్యాప్తంగా 1,38,000 ఐటీ ఉద్యోగాలు వస్తే ఒక్క తెలంగాణలోనే 33 శాతం వచ్చినట్లు వివరించింది.
IT Budget of Telangana 2022-23 : కొంపల్లిలో ఐటీ టవర్‌తో పాటు కొల్లూరు, ఉస్మాన్ సాగర్ ప్రాంతం, దక్షిణ హైదరాబాద్ ప్రాంతాలైన విమానాశ్రయం, శంషాబాద్ పరిసరాల్లో కొత్త ఐటీ క్లస్టర్లు ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఉప్పల్, పోచారం ప్రాంతాలకు కూడా ఐటీని విస్తరించనున్నట్లు పేర్కొంది.
టీఎస్ ఐపాస్ ద్వారా 19వేల పరిశ్రమలు..