ధరణి పోర్టల్ సంబంధింత సమస్యలు, ఫిర్యాదులు సమర్పించేందుకు ఫ్రభుత్వం ఓ వాట్సాప్ నంబర్, ఈ-మెయిల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. 9133089444, Ascmro@Telangana.gov.in ద్వారా ఫిర్యాదులు పంపించాలని సీఎస్, భూ పరిపాలన చీఫ్ కమిషనర్ సోమేశ్ కుమార్ తెలిపారు.
Dharani Portal:ధరణి పోర్టల్ సంబంధిత సమస్యలుంటే.. వాట్సాప్ చేయండి - dharani portal issues can be solved through whatsapp
ధరణి పోర్టల్ సంబంధిత సమస్యలు, ఫిర్యాదులు సమర్పించేందుకు ప్రభుత్వం వాట్సాప్ నంబర్, ఈ-మెయిల్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. వీటిద్వారా తమ ఫిర్యాదులు అందజేయాలని సూచించింది.
ధరణి పోర్టల్, వాట్సాప్‌లో ధరణి ఫిర్యాదులు
సమస్యలు వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు ఆరుగురు సభ్యులతో కూడిన ఓ కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీలో సభ్యులుగా సీసీఎల్ఏ, రిజిష్ట్రేషన్లు, ఐటీ విభాగాల అధికారులు ఉన్నారని ప్రభుత్వం తెలిపింది. శుక్రవారం రోజున.. ధరణి పోర్టల్ సమస్యలపై సీసీఎల్ఏ, సీఎస్ సోమేశ్ కుమార్ నిర్వహించిన సమీక్షలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు.
- ఇదీ చదవండి :Dharani: డిజిటల్ భూ సర్వేకు మూలాధారంగా ధరణి