కొత్త యాసంగి(రబీ) సీజన్ శుక్రవారం ప్రారంభమైంది. ఈ సీజన్‌లో వరిసాగు(rice cultivation in rabi season) గణనీయంగా తగ్గించాలని వ్యవసాయశాఖ నిర్ణయించింది. ఇందు కోసం గత నెల చివరివారంలో గ్రామగ్రామాన అవగాహనా సదస్సులు నిర్వహించి రైతుల(Telangana farmers)ను చైతన్య పరిచింది. గతేడాది యాసంగిలో వరి(rice cultivation in rabi season) సాధారణ విస్తీర్ణం 22.19 లక్షల ఎకరాలైతే 52.78 లక్షల ఎకరాల్లో సాగైంది. దీంతో ఈసారి గణనీయంగా తగ్గించాలన్నది లక్ష్యం. ప్రతీ రైతు పూర్తిగా మానేయకున్నా ఆయన సాగుచేసే విస్తీర్ణంలో సగమైనా ఇతర పంటలు వేసేలా అవగాహన సదస్సుల్లో వ్యవసాయ విస్తరణ అధికారులు(ఏఈఓ) సూచించారు.
ఇతర పంటలు వేస్తే వాటిని ఎవరు కొంటారని కొన్ని చోట్ల రైతులు(Telangana farmers) ప్రశ్నించినట్లు పలువురు ఏఈఓలు చెప్పారు. వరి సాగు(rice cultivation in rabi season)చేస్తే తమ గ్రామాల్లో ఏర్పాటుచేసే కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతుధరకు అమ్ముకుంటామని, ఇతర పంటలైతే అలా కుదరదని.. పూచీకత్తు ప్రభుత్వం ఇస్తుందా అని రైతులు(Telangana farmers) ప్రశ్నించారు. నల్గొండ జిల్లా పీఏ పల్లి మండలం పోలేపల్లి పరిధిలో రైతులు యాసంగిలో వరిసాగు మానేయడం కుదరదని చెప్పారు. ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసినా చేయకున్నా సొంతానికి వాడుకుంటామన్నారు.