Oil Palm Cultivation: సిరుల పంటగా భావించి ఆయిల్ పామ్ సాగుపై ప్రభుత్వం దృష్టి సారించింది. వచ్చే ఏడాది నాటికి రాష్ట్రంలో ఆయిల్‌పామ్ సాగు విస్తీర్ణాన్ని 8లక్షల ఎకరాలకు పెంచాలని సర్కార్ భావిస్తోంది. అందుకు అనుగుణంగా మొక్కలను సిద్ధం చేసేందుకు నర్సరీలను అభివృద్ధి చేయనుంది. ఇందుకోసం అధికారులు, కంపెనీల ప్రతినిధులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 80 వేల ఎకరాలకుపైగా ఆయిల్ పామ్ సాగు అవుతోందని సీఎస్‌కు వివరించిన అధికారులు... ఈ ఏడాది 2.18 లక్షల ఎకరాల విస్తీర్ణంలో సాగుకు సరిపడా మొక్కలు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు.
ఆయిల్‌పామ్ సాగు విస్తరణకు సర్కార్ ప్రత్యేక దృష్టి - ఆయిల్ పామ్ సాగుపై సీఎస్ సోమేశ్కుమాార్ సమీక్ష
Oil Palm Cultivation: 2023 నాటికి రాష్ట్రంలో ఆయిల్‌పామ్ సాగు విస్తీర్ణం పెంపునకు సర్కార్ చర్యలు చేపడుతోంది. సాగు విస్తీర్ణాన్ని 8లక్షల ఎకరాలకు పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకు అనుగుణంగా మొక్కలను సిద్ధం చేసేందుకు నర్సరీలను అభివృద్ధి చేయనుంది. ఇందుకోసం అధికారులు, కంపెనీల ప్రతినిధులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సమీక్ష నిర్వహించారు.
రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం మూడు లక్షల ఎకరాలకు చేరుతుందని సీఎస్‌కు వివరించారు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది మరో 5లక్షల ఎకరాల సాగుకు సరిపడా మొక్కలను సిద్ధం చేయాలని చేయాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. అందుకు అనుగుణంగా ఆయా ప్రాంతాల్లో నర్సరీలు అభివృద్ధి చేయాలని సూచించారు. రైతులు సులువుగా సాగు చేసేలా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని, పటిష్ఠ ప్రణాళికతో ముందుకెళ్లాలని తెలిపారు. రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగితే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని.. వంటనూనెల ఉత్పత్తి పెరగడంతో పాటు రైతులకూ ఎంతో లాభదాయకంగా ఉంటుందని సీఎస్ సోమేశ్‌కుమార్ అన్నారు.
ఇవీ చదవండి:ఏటా లక్ష శుక్లం శస్త్రచికిత్సలు చేయాలి: హరీశ్‌రావు