ఆహార రంగంలో దేశం సాధించుకున్న స్వావలంబనను కోల్పోకూడదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యవసాయరంగ పనులు కొనసాగుతాయని స్పష్టం చేశారు. వ్యవసాయ రంగ పనులు, వాటికి సంబంధించిన దుకాణాలు తెరిచే ఉంటాయన్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు అన్ని దుకాణాలు తెరిచి ఉంటాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో వంద శాతం దుకాణాలు తెరిచే ఉంచుతామన్నారు. పురపాలక ప్రాంతాల్లో 50 శాతం దుకాణాలకు మాత్రమే అవకాశం ఇస్తున్నట్లు తెలిపారు. పురపాలికల్లో లాటరీ పద్ధతిలో రోజుకు 50 శాతం దుకాణాలకు తెరిచేందుకు అనుమతిస్తామన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన దుకాణాలను మూసివేస్తామని హెచ్చరించారు.
రిజిస్ట్రేషన్ కార్యాలయాలు తెరుచుకుంటాయని, ఇసుక మైనింగ్ ప్రారంభిస్తామన్నారు. ఆర్టీఏ కార్యాలయాలు పని ప్రారంభిస్తాయని స్పష్టం చేశారు.