Funds To Health Department:రాష్ట్ర ప్రభుత్వం వైద్యారోగ్యశాఖకు నిధులు విడుదల చేసింది. వివిధ పద్దుల కింద రూ 337 కోట్ల 50 లక్షల రూపాయలు విడుదల చేసింది. జాతీయ ఆరోగ్య మిషన్ అమలు సహా ఇతరాల కోసం కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌కు 121 కోట్ల 82 లక్షల రూపాయలు విడుదలయ్యాయి. ఆసుపత్రుల స్థాయి పెంపు, పరికరాల కొనుగోలు కోసం వైద్యవిధాన పరిషత్ కమిషనర్‌కు రూ.120 కోట్లు విడుదల చేశారు.
Funds To Health Department: వైద్యారోగ్య శాఖకు రూ. 337.5 కోట్లు విడుదల - telangana health department news
Funds To Health Department: వివిధ పద్దుల కింద రూ. 337.5 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం.. వైద్యారోగ్య శాఖకు విడుదల చేసింది. జాతీయ ఆరోగ్య మిషన్, ఆస్పత్రుల్లో వసతుల కల్పన, ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు సహా ఇతర అవసరాలకు వినియోగించనున్నారు.
Funds To Health Department
బోధనాసుపత్రుల ఏర్పాటు కోసం రూ.50 కోట్లు, వైద్యకళాశాలల నిర్మాణం కోసం రూ.25 కోట్లను వైద్యవిద్య సంచాలకులకు విడుదలయ్యాయి. ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు కోసం రూ.13 కోట్ల 68 లక్షలు, పరికరాల కొనుగోలు కోసం ఐదు కోట్లు, భవనాల నిర్మాణం కోసం రెండు కోట్ల రూపాయలు విడుదల చేశారు.
ఇదీచూడండి:High Court serious on CS: సీఎస్‌పై హైకోర్టు సీరియస్.. రూ.10వేల జరిమానా