తెలంగాణ

telangana

ETV Bharat / city

రాష్ట్ర విద్యుత్ శాఖలో భారీగా పదోన్నతులు - విద్యుత్ శాఖలో పదోన్నతలు

రాష్ట్ర విద్యుత్ శాఖ ఉద్యోగులకు సర్కారు తీపికబురు చెప్పింది. 2009, 2010 బ్యాచ్​కు చెందిన పలువురు ఇంజినీర్లకు పదోన్నతులు కల్పించినట్లు పేర్కొంది. సుమారు 400 మందికి ప్రమోషన్లు లభించినట్లు అధికారులు వెల్లడించారు.

Promotions in the power sector telangana
తెలంగాణ విద్యుత్ శాఖలో ప్రమోషన్లు

By

Published : May 18, 2021, 9:09 PM IST

విద్యుత్ శాఖలో పని చేస్తున్నవారికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సుమారు 400 మందికి పైగా ఎలక్టికల్ ఇంజినీర్లకు ప్రమోషన్లు ఇవ్వనున్నట్లు ప్రకటించింది.

పదోన్నతులు పొందిన వారిలో 2009 బ్యాచ్​కు చెందిన 221మంది అసిస్టెంట్ ఇంజినీర్లు, 40 మంది అడిషనల్ అసిస్టెంట్ ఇంజినీర్లకు అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్లుగా పదోన్నతి ఇచ్చినట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ ప్రకటించింది. వీరితో పాటుగా 2010 బ్యాచ్​కు చెందిన 131 మంది అసిస్టెంట్ ఇంజినీర్లు, 13 మంది అడిషనల్ అసిస్టెంట్ ఇంజినీర్లు పదోన్నతి పొందినట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి:సీఎం కేసీఆర్‌కు సన్మానం చేస్తా: జగ్గారెడ్డి

ABOUT THE AUTHOR

...view details