సాదాబైనామాల క్రమబద్ధీకరణకు గడువు పెంచిన ప్రభుత్వం - free registrations in merged villages
17:03 October 31
సాదాబైనామాల క్రమబద్ధీకరణకు గడువు పెంచిన ప్రభుత్వం
మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో విలీనమైన గ్రామాల్లోనూ సాదాబైనామాల ద్వారా జరిగిన వ్యవసాయ భూములను ఉచితంగా క్రమబద్ధీకరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. జనగామ జిల్లా కొడకండ్లలో రైతువేదిక ప్రారంభించిన తర్వాత... ఉమ్మడి వరంగల్ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
వరంగల్ కార్పొరేషన్లో విలీనమైన గ్రామాల్లో కూడా సాదాబైనామాలను క్రమబద్ధీకరించాలని ముఖ్యమంత్రిని కోరారు. సానుకూలంగా స్పందించిన సీఎం... ఈ నిర్ణయం తీసుకున్నారు. దరఖాస్తు చేసుకునేందుకు వారం రోజుల పాటు గడువు ఇస్తూ... వెంటనే సంబంధించిన ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ను ఆదేశించారు.
ఇదీ చూడండి:అబద్ధమని నిరూపిస్తే రాజీనామా చేస్తా: కేసీఆర్