ప్రభుత్వ ఉద్యోగులకు 2019 జూలై 1 నుంచి రావాల్సిన డీఏను 5.24 శాతం పెంచుతూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం 33.53 శాతం ఉన్న డీఏను 38.77 శాతానికి పెంచింది. 2019 జూలై 1 నుంచి మూలవేతనంపై డీఏ అమలు చేయనున్నట్లు తెలిపింది.
ఉద్యోగులకు తీపి కబురు.. డీఏ పెంచుతూ ఉత్తర్వులు జారీ - 26th of this month as a holiday in telangana
18:18 October 23
ఉద్యోగులకు తీపి కబురు.. డీఏ పెంచుతూ ఉత్తర్వులు జారీ
వరద బాధితుల కోసం ప్రకటించిన ఒకరోజు వేతనానికి సంబంధించిన సమ్మతి లేఖను.. ఉద్యోగ సంఘాల నేతలు సీఎం కేసీఆర్‌ను కలిసి అందజేశారు. టీఎన్జీఓలు, టీజీఓలు, నాలుగో తరగతి ఉద్యోగులు, డ్రైవర్లు.. ఒకరోజు వేతనం రూ. 33 కోట్లను విరాళంగా ఇవ్వనున్నట్టు తెలిపారు. త్వరలోనే ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశమై.. వారి సమస్యలు పరిష్కరిస్తానని తనను కలిసిన నేతలకు కేసీఆర్ హామీ ఇచ్చారు.
దసరా పండుగ సెలవు మార్పు..
దసరా పండుగ సెలవు ఆదివారం కాకుండా మరుసటి రోజైన సోమవారం ప్రకటించాలని కేసీఆర్ నిర్ణయించారు. ఇకపై ప్రతి ఏడాది దసరాకు.. మరుసటి రోజును సెలవు దినంగా నిర్ణయిస్తూ షెడ్యూల్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు
ఇవీచూడండి:ఈనెల 29న ధరణి పోర్టల్ ప్రారంభం