తెలంగాణ

telangana

ETV Bharat / city

New Dialysis Centers: ఆ రోగులకు శుభవార్త... కొత్తగా మరికొన్ని కేంద్రాలు - టీఎస్ఎంఐడీసీ తాజా సమాచారం

New Dialysis Centers: రాష్ట్రంలో పెరుగుతున్న కిడ్నీ బాధితుల కోసం సర్కార్ డయాలసిస్ కేంద్రాల పెంపునకు చర్యలు చేపట్టింది. 515 డయాలసిస్ యంత్రాలతో 61 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. తొలిదశలో ఏడు ప్రాంతాల్లో అందుబాటులోకి తేవడానికి ఆదేశాలు జారీ చేసింది.

Dialysis Centers
Dialysis Centers

By

Published : Apr 6, 2022, 8:28 PM IST

New Dialysis Centers: రాష్ట్రంలో పెరుగుతున్న కిడ్నీ బాధితుల అవసరాల దృష్ట్యా డయాలసిస్ కేంద్రాల పెంపునకు సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 515 డయాలసిస్ యంత్రాలతో 61 కేంద్రాలను నూతనంగా ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఆయా కేంద్రాలను విడతల వారీగా ఏర్పాటు చేయనున్నట్లు సర్కారు పేర్కొంది. తొలిదశలో ఏడు ఆసుపత్రుల్లో డయాలసిస్ కేంద్రాల ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేసింది.

మొదటగా బాన్సువాడ, భువనగిరి, బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రులు, కొడంగల్ ప్రభుత్వాసుపత్రి, కొల్లాపూర్, ఎల్లారెడ్డి కమ్యునిటీ హెల్త్ సెంటర్స్, నారాయణపేట జిల్లా ఆసుపత్రుల్లో కొత్త డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఒక్కో కేంద్రంలో ఐదేసి యంత్రాలు అందుబాటులోకి రానున్నాయి. అందుకు సంబంధించి వెంటనే చర్యలు చేపట్టాలని వైద్య విధాన పరిషత్ కమిషనర్, టీఎస్ఎంఐడీసీ డైరెక్టర్​ను వైద్యారోగ్య శాఖ కార్యదర్శి ఆదేశించారు.

ఇదీ చదవండి:గ్రూప్ 1, గ్రూప్ 2, ఎస్సై అభ్యర్థులకు ఉచిత శిక్షణ... నెలనెలకు స్టైఫండ్‌

ABOUT THE AUTHOR

...view details