Classification Of Posts: పోస్టుల వర్గీకరణ పూర్తిచేసిన రాష్ట్ర ప్రభుత్వం - పోస్టుల వర్గీకరణ వార్తలు
10:12 August 06
Classification Of Posts: పోస్టుల వర్గీకరణ పూర్తిచేసిన రాష్ట్ర ప్రభుత్వం
ప్రభుత్వ ఉద్యోగాల కేడర్ వర్గీకరణ ప్రక్రియ పూర్తైంది. ఆయా శాఖల్లోని పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం కేడర్ వారీగా విభజించింది. రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా అన్ని శాఖల్లోని ఉద్యోగాలు, పోస్టులను జిల్లా, జోనల్, మల్టీజోనల్ కేడర్ వారీగా వర్గీకరించారు. గతంలో ఉన్న స్టేట్ కేడర్ పోస్టులైన ఆర్డీవో, డీపీవో, జిల్లా రిజిస్ట్రార్ తదితర పోస్టులన్నింటినీ మల్టీజోన్ కేటగిరీలో చేర్చారు. దీంతో గ్రూప్ వన్ పోస్టులన్నీ కూడా మల్టీజోన్లోనే ఉండనున్నాయి.
దాంతో పాటు ఇతర పోస్టులను కూడా మల్టీజోనల్ నుంచి జోనల్‌కు, జోనల్ నుంచి జిల్లా కేటగిరీకి పోస్టులకు మార్పులు, చేర్పులు చేశారు. ఈ మేరకు ఆయా శాఖల్లోని పోస్టుల వర్గీకరణ ఖరారు చేస్తూ ఉత్తర్వులు వెలువరించారు. మొత్తం 84 శాఖాధిపతులకు సంబంధించి పోస్టుల వర్గీకరణ పూర్తి చేశారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ విడివిడిగా ఉత్తర్వులు జారీ చేశారు.
ఇదీ చదవండి:Central Minister Shekhawat: కృష్ణాపై అనుమతుల్లేని ప్రాజెక్టులను ఆపేయాలి