రాష్ట్రంలో అదనపు డీజీలుగా ఉన్న ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులకు డీజీలుగా పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్గా పనిచేస్తున్న గోపీకృష్ణ.. ప్రత్యేక భద్రతా దళం డీజీగా అదనపు బాధ్యతుల నిర్వహిస్తున్నారు.
ఇద్దరు ఐపీఎస్ అధికారులకు పదోన్నతులు - telangana news
రాష్ట్రంలో ఇద్దరు ఐపీఎస్ అధికారులకు ప్రభుత్వం పదోన్నతులు కల్పించింది. అదనపు డీజీలుగా ఉన్న ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులకు డీజీలుగా పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ips
అనిశా డీజీగా ఉన్న పూర్ణచంద్రరావు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా అదనపు బాధ్యతల్లో కొనసాగుతున్నారు. వీరికి డీజీలుగా పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే వీరు ప్రస్తుతం అదే బాధ్యతల్లో కొనసాగనున్నారు. ఈ మేరకు పూర్ణచంద్రరావు బాధ్యతలు స్వీకరించారు.
ఇదీ చదవండి :రజనీ వెనక్కి తగ్గడానికి కారణాలివేనా?