స్థలాలు, లేఅవుట్ల క్రమబద్ధీకరణ దరఖాస్తు గడువును రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. వర్షాలు, ఇతర సాంకేతిక కారణాల వల్ల దరఖాస్తు చేసుకోని వారికి నెలాఖరు వరకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది.
ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తు గడువును పొడిగించిన ప్రభుత్వం
22:26 October 15
ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తు గడువును పొడిగించిన ప్రభుత్వం
ప్రభుత్వ మొదటి ఉత్తర్వుల ప్రకారం దరఖాస్తు గడువు గురువారంతో ముగియాలి. గురువారం రాత్రి వరకు 19 లక్షల 30 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. నిన్న ఒక్కరోజే ఏకంగా రెండు లక్షల 50 వేలకు పైగా దరఖాస్తులు అందాయి. వర్షాలు, వివిధ కారణాల రీత్యా దరఖాస్తు చేసుకోలేదని, గడువు పొడిగించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తులు అందాయి.
మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి, సీఎస్ సోమేశ్ కుమార్‌తో సమీక్షించిన ముఖ్యమంత్రి కేసీఆర్... దరఖాస్తు గడువు పొడిగించాలని నిర్ణయించారు. సీఎం నిర్ణయం మేరకు ఎల్‌ఆర్‌ఎస్ కోసం దరఖాస్తుల గడువును నెలాఖరు వరకు పొడిగించినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు
ఇవీచూడండి:ఎల్‌ఆర్‌ఎస్ సందేహాలపై అధికారితో ముఖాముఖి