TS Liquor shop license: బార్లు, మద్యం దుకాణాల లైసెన్సుల గడువు పొడిగింపు - మద్యం దుకాణాల లైసెన్స్
![TS Liquor shop license: బార్లు, మద్యం దుకాణాల లైసెన్సుల గడువు పొడిగింపు telangana government Extended Liquor shop license for one more month](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13096288-710-13096288-1631898547874.jpg)
22:24 September 17
రెండోదశ కరోనాతో మూతపడడంతో నెలపాటు పొడిగించిన ఆబ్కారీశాఖ
బార్‌లు, మద్యం దుకాణాల లైసెన్సుల గడువును పొడిగిస్తూ... తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కారణంగా మూతపడిన కారణంగా... బార్లు, వైన్స్‌ల లైసెన్సులను మరో నెల పాటు పొడిగించింది. అక్టోబర్ చివరినాటికి ముగియనున్న మద్యం దుకాణాల లైసెన్సుల గడువును నెల రోజులు పొడిగింపుతో నవంబర్ 30 వరకు కొనసాగనున్నాయి.
ఈనెల ఆఖరికి బార్ల లైసెన్సుల గడువు ముగియనుండగా.. నెలరోజుల పొడిగింపుతో అక్టోబర్ 31 వరకు కొనసాగనున్నాయి. రెండో దశ కరోనా సమయంలో మద్యం దుకాణాలు, బార్లు మూతపడిన కారణంగా అదనంగా నెల పాటు పొడిగిస్తున్నట్లు ఆబ్కారీ అధికారులు పేర్కొన్నారు.
ఇదీ చూడండి: