చొక్కారావు ఎత్తిపోతల పంప్‌హౌస్, కాకతీయ కాల్వ క్రాస్ రెగ్యులేటర్ స్వాధీనం కోసం గోదావరి నదీ యాజమాన్య బోర్డు సిద్ధం చేసిన నోట్‌పై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇవాళ జరిగిన జీఆర్ఎంబీ ఉపసంఘం సమావేశంలో (GRMB Sub Committee Meeting) తెలంగాణ అధికారులు ఈ మేరకు నిరసన వ్యక్తం చేశారు. గోదావరి బోర్డు సభ్య కార్యదర్శి బీపీ పాండే నేతృత్వంలో జలసౌధలో ఉపసంఘం సమావేశం జరిగింది.
ఆ నోట్‌పై చర్చించలేం..
చొక్కారావు ఎత్తిపోతల పంప్‌హౌస్, కాకతీయ కాల్వ క్రాస్ రెగ్యులేటర్, తొర్రిగెడ్డ, చాగల్నాడు ఎత్తిపోతల పథకాల స్వాధీనం ఎజెండాగా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. నాలుగింటి స్వాధీనం కోసం గోదావరి బోర్డు నోట్ సిద్ధం చేసింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన తెలంగాణ అధికారులు... ఉప సంఘంతో సంబంధం లేకుండా ప్రాజెక్టులను ఎలా సందర్శిస్తారని ప్రశ్నించారు. స్వాధీనం నోట్‌పై తాము చర్చించబోమని, సమయం కావాలని కోరారు. పెద్దవాగు ప్రాజెక్టు స్వాధీనానికి (GRMB Sub Committee Meeting) మాత్రమే బోర్డు అంగీకరించిందని... ఇతర ప్రాజెక్టుల స్వాధీనం విషయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు లేవని స్పష్టం చేశారు. పెద్దవాగు మినహా ఇతర ప్రాజెక్టుల సిబ్బంది, ఆస్తుల వివరాలను ప్రభుత్వం అనుమతి లేకుండా ఇవ్వలేమని అన్నారు.
సీఐఎస్ఎఫ్ భద్రత అవసరం లేదు..