తెలంగాణ

telangana

ETV Bharat / city

Letter to GRMB: 'ఆ ప్రాజెక్టులను ప్రభుత్వం రీడిజైనింగ్ చేసింది' - grmb notification

telangana-government-another-letter-to-grmb
telangana-government-another-letter-to-grmb

By

Published : Nov 3, 2021, 3:38 PM IST

Updated : Nov 3, 2021, 4:37 PM IST

15:35 November 03

Letter to GRMB: 'ఆ ప్రాజెక్టులను ప్రభుత్వం రీడిజైనింగ్ చేసింది'

గోదావరికి సంబంధించిన ఆరు ప్రాజెక్టుల డీపీఆర్​ల విషయంలో కాలయాపన చేయకుండా.. వెంటనే కేంద్ర జలసంఘానికి పంపాలని నదీ యాజమాన్య బోర్డును తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఈ మేరకు గోదావరి నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం మరో లేఖ రాసింది. జీఆర్ఎంబీ చైర్మన్​కు లేఖ రాసిన నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్... అక్టోబర్ 26న రాసిన లేఖకు కొనసాగింపుగా ప్రాజెక్టుల డీపీఆర్​ల అంశాన్ని ప్రస్తావించారు.

చౌటుపల్లి హన్మంతరెడ్డి, చిన్న కాళేశ్వరం, సీతారామ ఎత్తిపోతల పథకాలు, తుపాకుల గూడెం, మోడికుంట వాగు ప్రాజెక్టులు కొత్తవి కావని... వాటిని 2010లో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వమే ప్రారంభించినట్లు తెలిపారు. లోపాలను సవరిస్తూ.. పూర్తి స్థాయిలో నీటిని వినియోగించుకునేలా తెలంగాణ ప్రభుత్వం రీడిజైనింగ్ చేసిందని పేర్కొన్నారు. తెలంగాణకు ఉన్న 967 టీఎంసీల నుంచే వీటికి నీటిని తీసుకోనున్నట్లు వివరించారు. ఈ ప్రాజెక్టుల ప్రభావం ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులపై ఎంత మాత్రమూ ఉండబోదని స్పష్టం చేశారు. కేంద్ర జలశక్తి శాఖ జారీ చేసిన గెజిట్ ప్రకారం ఈ ప్రాజెక్టులకు ఆర్నెళ్లలోగా అనుమతులు పొందాల్సిన అవసరం ఉందని అన్నారు.

ఈ ప్రాజెక్టులన్నీ కూడా 2014 జూన్ కంటే ముందే చేపట్టిన ప్రాజెక్టులు అయినందున ఇరిగేషన్ ప్లానింగ్, వ్యయం, డిజైన్లు తదితర అంశాలను గోదావరి బోర్డు పరిశీలించాల్సిన అవసరం లేదని గుర్తుచేశారు. సీడబ్ల్యూసీలోని డైరెక్టరేట్లు ఈ అంశాలన్నింటిని చూసుకుంటాయని ఈఎన్సీ పేర్కొన్నారు. కొత్త ప్రాజెక్టు అయినప్పటికీ.. రాయలసీమ ఎత్తిపోతల డీపీఆర్ విషయంలో హైడ్రాలజీ, ఇరిగేషన్ ప్లానింగ్, నీటి లభ్యత, అంతర్ రాష్ట్ర సమస్యలు, లాంటి వాటిని కేంద్ర జలసంఘానికి వదిలిపెడ్తూ.. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు నిర్ణయం తీసుకున్న విషయాన్ని లేఖలో ప్రస్తావించారు.

రాయలసీమ ఎత్తిపోతల డీపీఆర్​ను కేఆర్ఎంబీ తెలంగాణకు కూడా ఇవ్వలేదని... అదే తరహాలో తెలంగాణ డీపీఆర్​లను గోదావరి బోర్డు ఏపీకి ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. విభజన చట్టం ప్రకారం పనిచేయాల్సిన కృష్ణా, గోదావరి బోర్డులు విభిన్న నిర్ణయాలు తీసుకొంటున్నాయని ఈఎన్సీ పేర్కొన్నారు. కొనసాగుతున్న ప్రాజెక్టులకు సాంకేతిక అనుమతులను కేంద్ర జలసంఘంలోని డైరెక్టరేట్లు, సాంకేతిక సలహా మండలి చూసుకుంటాయని... తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా గోదావరి బోర్డు ఈ విషయంలో ప్రత్యేక విధానాన్ని అవలంభించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

వీటన్నింటి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సమర్పించిన ఆరు ప్రాజెక్టుల డీపీఆర్ లను కాలయాపన చేయకుండా వెంటనే కేంద్ర జలసంఘానికి పంపాలని మరోమారు కోరారు. ప్రాజెక్టుల అనుమతుల ప్రక్రియ వేగవంతం చేస్తామని రెండో ఎపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కేంద్ర జలశక్తి శాఖా మంత్రి హామీ ఇచ్చారని ఈఎన్సీ లేఖలో గుర్తుచేశారు.

ఇదీ చూడండి:

Last Updated : Nov 3, 2021, 4:37 PM IST

ABOUT THE AUTHOR

...view details