గాంధీ, టిమ్స్ ఆస్పత్రుల్లోని కొవిడ్ ఇన్పేషెంట్లలో అవసరమైన వారికి డయాలసిస్ సేవలూ అందనున్నాయి. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. ప్రస్తుతం ఉన్న సంస్థ ద్వారా.. అదే ధరలకు డయాలసిస్ చేసేందుకు అనుమతిచ్చింది. పీసీసీ కిట్లను మాత్రం సంబంధిత ఆస్పత్రులు సమకూర్చనున్నాయి.
కొవిడ్ ఇన్‌పేషెంట్లకు డయాలసిస్ సేవలు - గాంధీ ఆస్పత్రిలో కొవిడ్ ఇన్‌పేషెంట్లకు డయాలసిస్
గాంధీ, టిమ్స్ ఆస్పత్రుల్లోని కొవిడ్ ఇన్‌పేషెంట్లకు డయాలసిస్ సేవలు అందించేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. గాంధీ ఆస్పత్రిలో ఒక్కో డయాలసిస్‌కు రూ.1,175, టిమ్స్ రూ.1,215 చెల్లించాల్సి ఉంటుంది.
![కొవిడ్ ఇన్‌పేషెంట్లకు డయాలసిస్ సేవలు dialysis for covid positive patients](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11474510-1011-11474510-1618921263780.jpg)
కొవిడ్ ఇన్‌పేషెంట్లకు డయాలసిస్ సేవలు
ఆయా ఆస్పత్రుల్లో డయాలసిస్ కోసం సంస్థకు చెల్లించే మొత్తాన్ని కూడా ప్రభుత్వం పేర్కొంది. గాంధీ ఆస్పత్రిలో ఒక్కో డయాలసిస్‌కు రూ.1,175, టిమ్స్ రూ.1,215 చెల్లిస్తారు. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇవీచూడండి:నిలకడగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యం