వీధివ్యాపారులకు రుణాల్లో రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. పీఎం స్వానిధి పథకం కింద 3,57,610 మంది వీధివ్యాపారులకు 357 కోట్లా 61 రూపాయల రుణం లభించింది. వీధివ్యాపారుల నమోదు కోసం ప్రత్యేక యాప్ తీసుకొచ్చిన పురపాలకశాఖ... ఐదు లక్షలకుపైగా వీధివ్యాపారులను నమోదు చేసింది. రాష్ట్రంలో మూడు లక్షలా 40వేల మంది వీధివ్యాపారులకు రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ధేశించగా... దాన్ని మించి 3,57,610 మంది రుణాలు ఇచ్చారు.
అందులో 94శాతం 3,19,765 మంది డిజిటల్ లావాదేవీలు నిర్వహిస్తున్నారు. నెలకు కనీసం 200 పైగా డిజిటల్ లావాదేవీలు నిర్వహించే వారికి ప్రతినెలా వంద రూపాయలు ప్రోత్సాహకంగా అందిస్తారు. డిజిటల్ లావాదేవీలతో రాష్ట్రానికి చెందిన వీధివ్యాపారులు 35 లక్షల రూపాయలు ప్రోత్సాహకంగా అందుకున్నారు. 13 లక్షల ప్రోత్సాహకంతో మధ్యప్రదేశ్ రెండో స్థానంలో ఉంది. పీఎం స్వానిధిలో మొదటిస్థానంలో నిలిచిన తెలంగాణను కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ కార్యదర్శి దుర్గాశంకర్ మిశ్రా అభినందించారు.