తెలంగాణ

telangana

ETV Bharat / city

కేంద్ర పన్నుల వాటాలో ఈ నెల కూడా రాష్ట్రానికి కోత - తెలంగాణకు కేంద్రం పన్నుల వాటా

లాక్ డౌన్ కారణంగా ఆదాయాలు పడిపోయిన నేపథ్యంలో ఈ నెల అయినా కేంద్రం నుంచి రాష్ట్రానికి పూర్తి నిధులు వస్తాయని భావించినప్పటికీ నిరాశే మిగిలింది. కేంద్ర పన్నుల వాటాలో ఈ నెల కూడా కోత పడింది. రాష్ట్రాలకు ఇవ్వాల్సిన వాటాలో ఏప్రిల్ నెలకు 17.81శాతం కోత విధించిన కేంద్రం... మే నెలలోనూ అదే తరహాలో నిధులు విడుదల చేసింది.

Central government
Central government

By

Published : May 21, 2020, 1:51 PM IST

కేంద్ర పన్నుల వాటాలో ఈ నెల కూడా కోత పడింది. రాష్ట్రాలకు ఇవ్వాల్సిన వాటాలో ఏప్రిల్ నెలకు 17.81శాతం కోత విధించిన కేంద్రం... మే నెలలోనూ అదే తరహాలో నిధులు విడుదల చేసింది. ఫలితంగా రాష్ట్రానికి రూ.1,195 కోట్ల రూపాయలకు గానూ కేవలం రూ.982 కోట్లు మాత్రమే వచ్చాయి. రూ.213 కోట్లు కోత పడ్డాయి. లాక్ డౌన్ కారణంగా ఆదాయాలు పడిపోయిన నేపథ్యంలో ఈ నెల అయినా కేంద్రం నుంచి పూర్తి నిధులు వస్తాయని భావించినప్పటికీ నిరాశే మిగిలింది.

గత నెల తరహాలోనే రూ.982 కోట్లు కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటాగా వచ్చాయి. అటు రాష్ట్రంలోని పట్టణ ప్రాంత స్థానిక సంస్థలకు కేంద్రం రూ.105 కోట్లు విడుదల చేసింది. 15వ ఆర్థిక సంఘం నిధుల్లో మొదటి వాయిదాగా ఈ మొత్తాన్ని విడుదల చేశారు. పదిరోజుల్లోగా సంబంధిత నిధులను పట్టణప్రాంత స్థానిక సంస్థలకు ఎలాంటి కోత లేకుండా బదలాయించాలన్న కేంద్రప్రభుత్వం... ఆలస్యం చేస్తే ఆ మేరకు మార్కెట్ వడ్డీ రేటు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది.

రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల రాబడి వంద కోట్ల మార్కును దాటింది. ఈ నెల ఏడో తేదీ నుంచి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలన్నీ పూర్తిగా తెరుచుకోవడంతో రిజిస్ట్రేషన్లు క్రమంగా పెరుగుతున్నాయి. ఏప్రిల్‌లో రిజిస్ట్రేషన్ల ద్వారా కేవలం రూ.13కోట్లు ఆదాయం రాగా... మే నెలలో ఇప్పటి వరకు రూ.104 కోట్లు వచ్చాయి. లాక్ డౌన్ నిబంధనలు సడలించిన నేపథ్యంలో రిజిస్ట్రేషన్ లావాదేవీలు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details