తెలంగాణ

telangana

ETV Bharat / city

Telangana genco CMD prabhakar rao : 'అలా చేస్తే.. రాష్ట్ర విద్యుత్, సాగునీటి అవసరాలపై తీవ్ర ప్రభావం' - genco cmd on central gazette

తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదం కారణంగా కేంద్ర సర్కార్ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్​ను.. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాతే అమలుకు చర్యలు తీసుకుంటామని తెలంగాణ జెన్​కో సీఎండీ ప్రభాకర్ రావు(Telangana genco CMD prabhakar rao) స్పష్టం చేశారు. కేంద్ర గెజిట్ ప్రకారం జలవిద్యుత్ కేంద్రాల నిర్వహణ బోర్డుల నియంత్రణలోకి వెళ్తే.. రాష్ట్ర విద్యుత్, సాగునీటి అవసరాలపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

Telangana genco CMD prabhakar rao
Telangana genco CMD prabhakar rao

By

Published : Sep 21, 2021, 2:01 PM IST

తెలంగాణ-ఏపీల మధ్య చెలరేగిన జలవివాదాన్ని పరిష్కరించేందుకు కేంద్ర సర్కార్ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం జలవిద్యుత్ కేంద్రాల నిర్వహణ కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(krishna river management board), గోదావరి నది యాజమాన్య బోర్డుల(godavari river management board) నియంత్రణలోకి వెళ్తే.. రాష్ట్ర విద్యుత్, సాగునీటి అవసరాలపై తీవ్ర ప్రభావం పడుతుందని జెన్​కో(Telangana genco CMD prabhakar rao) ఆందోళన వ్యక్తం చేస్తోంది.

గరిష్ఠ విద్యుత్ డిమాండ్ నెలకొనే సమయాలతో పాటు సాగునీటి అవసరాల కోసం విద్యుద్​ ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉండదని జెన్​కో(Telangana genco CMD prabhakar rao) స్పష్టం చేసింది. ఈ మేరకు తెలంగాణ జెన్‌కో సీఎండీ డి.ప్రభాకర్ రావు(Telangana genco CMD prabhakar rao) తాజాగా ఇంధన శాఖ కార్యదర్శికి లేఖ రాశారు. జలవిద్యుత్ అవసరాలు తీర్చడంతో పాటు నాగార్జునసాగర్‌కు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌గా ఉపయోగపడాలనే ఉద్దేశంతో శ్రీశైలం జలాశయాన్ని నిర్మించారని లేఖలో పేర్కొన్నారు.

ప్రభుత్వ ఆదేశాల తర్వాతే అమలు

"కృష్ణా(krishna river management board), గోదావరి(godavari river management board) బోర్డులకు రాష్ట్రంలోని జల విద్యుత్ కేంద్రాల నియంత్రణను అప్పగించడంతో పాటు వాటి నిర్వహణకు అవసరమైన సిబ్బంది బదిలీపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు మాకు ఎలాంటి సూచనలు రాలేదు. ఆయా బోర్డుల నుంచి మాకు అందుతున్న సూచనలను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాతే గెజిట్ నోటిఫికేషన్ల అమలుకు చర్యలు తీసుకుంటాం."

- ప్రభాకర్ రావు(Telangana genco CMD prabhakar rao), తెలంగాణ జెన్​కో సీఎండీ

మరోవైపు.. కృష్ణా(krishna river management board), గోదావరి బోర్డుల(godavari river management board) పరిధికి సంబంధించిన గెజిట్‌ నోటిఫికేషన్‌ అమలు గడువుపై కేంద్రజల్‌శక్తి మంత్రిత్వశాఖ(Ministry of Jal Shakti) తర్జనభర్జన పడుతోంది. జులై 15న జారీ చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం అక్టోబరు 14 నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. దీనికి సంబంధించి ఇప్పటివరకు ఏం జరిగాయి? ఇంకా చేయాల్సిందేమిటి? తదితర అంశాలపై ఇరు బోర్డుల ఛైర్మన్లు, ఇతర అధికారులతో చర్చించింది.

నోటిఫికేషన్‌లోని రెండో షెడ్యూలులో పేర్కొన్న ప్రాజెక్టులను బోర్డుల పరిధిలోకి తీసుకోవాల్సి ఉంది. ఈ ప్రాజెక్టుల్లోని సిబ్బంది వివరాలు, యంత్రాలు, భవనాలు ఇలా అన్నీ పూర్తి స్థాయిలో స్వాధీనం చేయడంపై ఇప్పటివరకు రాష్ట్రాల నుంచి వచ్చిన స్పందన గురించి చర్చించారు.

నోటిఫికేషన్ అమలు కార్యాచరణ కోసం రోడ్ మ్యాప్ తయారు చేసేందుకు వీలుగా రెండు బోర్డుల(krishna river management board) & (godavari river management board)కు సంబంధించి ఉమ్మడిగా ఉపసంఘాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. గతంలో ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీల స్థానంలో చీఫ్ ఇంజనీర్ల స్థాయిలో ఉపసంఘం ఏర్పాటు కానుంది.

సంబంధిత కథనాలు :

ABOUT THE AUTHOR

...view details