ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్తో తెలంగాణ మాజీ ఎన్నికల కమిషనర్, ఎన్నికల సంఘం సలహాదారు నాగిరెడ్డి భేటీ అయ్యారు. విజయవాడలోని ఏపీ ఎస్ఈసీ కార్యాలయంలో వివిధ అంశాలపై చర్చించారు. నాలుగో విడత పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ అంశంపై వారిరువురూ సమీక్ష నిర్వహించారు.
నిమ్మగడ్డతో రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి భేటీ - AP Municipal Elections updates
ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్తో తెలంగాణ మాజీ ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి భేటీ అయ్యారు. పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలపై ఇరువురి మధ్య సమీక్ష జరిగింది.
నిమ్మగడ్డతో రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి భేటీ
ఎన్నికల్లో నామినేషన్ల గందరగోళం, బలవంతపు నామినేషన్ల ఉపసంహరణ, వివిధ అంశాలపై కోర్టు ఆదేశాలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ కొనసాగిస్తూ నోటిఫికేషన్ జారీ చేసే అంశాలు భేటీలో ప్రస్తావనకు వచ్చినట్టు సమాచారం.
ఇదీ చదవండి: ఉపాధి హామీ పథకానికి నిధులు విడుదల