తెలంగాణ

telangana

ETV Bharat / city

తెలంగాణ ఆవిర్భావ వేడుకలు.. ఈసారి గిట్లనే! - ప్రగతి భవన్​లో ముఖ్యమంత్రి జెండా ఆవిష్కరణ

రాష్ట్రం ఆవిర్భావ ఉత్సవాలకు సిద్ధమైంది. స్వరాష్ట్ర కాంక్ష సిద్ధించి ఆరేళ్లు పూర్తి చేసుకున్న తెలంగాణ... మరో సంవత్సరంలోకి అడుగేయనుంది. కరోనా నేపథ్యంలో ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేకుండా వేడుకలు జరగనున్నాయి. రాజధానిలోని గన్​పార్క్ వద్ద అమరవీరులకు నివాళులు అర్పించిన అనంతరం... ప్రగతి భవన్​లో ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పతాకం ఆవిష్కరించనున్నారు.

telangana formation day celebrations
తెలంగాణ ఆవిర్భావ వేడుకలు.. ఈసారి గిట్లనే!

By

Published : Jun 2, 2020, 6:06 AM IST

స్వరాష్ట్ర ఆకాంక్ష సిద్ధించి ఆరేళ్లు గడిచింది. సుదీర్ఘ పోరాటం, ఉద్యమం అనంతరం వివిధ పరిణామాలు, ప్రక్రియలను దాటుకుంటూ ఆరేళ్ల కింద తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ పూర్తి చేసుకుని 2014 జూన్ 2న కొత్త పది జిల్లాల తెలంగాణ భారతదేశ చిత్రపటంలో 29 రాష్ట్రంగా చేరింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా ఈఎస్​ఎల్​ నరసింహన్... రాష్ట్ర గవర్నర్‌గా ప్రమాణస్వీకారంతో నూతన అధ్యాయం ప్రారంభమైంది. సాధారణ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు... రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఆ వెంటనే రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొన్నారు.

ముందస్తులో విజయం

తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుతానంటూ ముఖ్యమంత్రి కేసీఆర్​ తన ప్రణాళికను వెల్లడించారు. అప్పటి నుంచి కేసీఆర్ నేతృత్వంలో తెరాస సర్కార్ ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం వివిధ కార్యక్రమాలు అమలు చేస్తూ ముందుకు సాగుతోంది. ఐదేళ్ల గడువుకు ముందే ముందస్తు ఎన్నికల రూపంలో ప్రజల ముందుకెళ్లిన కేసీఆర్... మరోమారు విజయ ఢంగా మోగించి 2018 డిసెంబర్ 13న ముఖ్యమంత్రిగా రెండోసారి బాధ్యతలు చేపట్టారు.

ఇదీ చూడండి:విద్యుత్​ రంగంలో వెలుగుతున్న తెలంగాణ

నిరాడంబరంగా వేడుకలు

రాష్ట్రం అవతరించి ఆరేళ్లు పూర్తైంది. ఏటా రాష్ట్ర ఆవిర్భావ వేడులు ప్రభుత్వం వైభవంగా... సికింద్రాబాద్ కవాతు మైదానంతోపాటు అన్ని జిల్లాల్లోనూ కార్యక్రమాలు నిర్వహించేది. అవతరణ వేడుకలను పురస్కరించుకొని వివిధ కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా వారం రోజులపాటు నిర్వహించేది. కోవిడ్ మహమ్మారి విజృంభణ నేపథ్యంలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు నిరాడంబరంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎక్కడా ఎలాంటి సభలు, సమావేశాలు లేకుండా నిర్వహించాలని స్పష్టం చేసింది.

ఇదీ చూడండి:కొత్త పారిశ్రామిక పాలసీ.. తరలి వచ్చిన పరిశ్రమలు

లాక్​డౌన్​ నిబంధనలు తప్పనిసరి

హైదరాబాద్ గన్‌పార్క్ వద్దనున్న అమరవీరుల స్థూపం వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులు అర్పించి... ఆ తర్వాత ప్రగతి భవన్‌లో జాతీయ పతాకం ఆవిష్కరిస్తారు. మంత్రులు, ఇతర ప్రముఖులు జిల్లా కేంద్రాల్లో జాతీయ పతాకాన్ని అవిష్కరించనున్నారు. జిల్లా కేంద్రాల్లో పరిమిత సంఖ్యలో అతిథులకు ఎట్ హోమ్ కార్యక్రమం నిర్వహిస్తారు. ప్రజాప్రతినిధులందరూ వారికి సంబంధించిన కార్యాలయాల్లో ఉదయం ఎనిమిదిన్నరకే జాతీయ పతాకం ఆవిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ వేడుకలు నిర్వహిస్తారు. మాస్కులు, శానిటైజర్లు విధిగా ఉపయోగించడం, భౌతిక దూరం తప్పకుండా పాటించాలని సూచించింది.

ఇదీ చూడండి:ఐటీ ఎగుమతుల్లో తెలంగాణకు లేదు పోటీ!

ABOUT THE AUTHOR

...view details