తెలంగాణ భవన్లో రాష్ట్ర అవతరణ వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కె. కేశవరావు జాతీయ జెండా ఆవిష్కరించారు. కార్యక్రమంలో తెరాస లోక్‌సభా పక్ష నేత నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యుడు సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Formation Day: తెలంగాణ భవన్లో రాష్ట్ర అవతరణ వేడుకలు - తెలంగాణ అవతరణ దినోత్సవాలు
తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర ఆవిర్భవ దినోత్సవాలు ఘనంగా జరిగాయి. తెలంగాణ భవన్లో అవతరణ వేడుకలు నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో తెరాస సెక్రెటరీ జనరల్ కె.కేశవరావు, ఎంపీ నామా నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
TELANGANA FORMATION DAY CELEBRATIONS IN TRS BHAVAN
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో దూసుకెళ్తోందని కేకే పేర్కొన్నారు. తెలంగాణకు కేసీఆర్ స్వాతంత్ర్యం తెచ్చారన్న నామా నాగేశ్వరరావు... రాష్ట్రాభివృద్ధి కోసం ప్రజలంతా ముఖ్యమంత్రికి అండగా నిలవాలని కోరారు.