తెలంగాణ

telangana

ETV Bharat / city

LIVE UPDATES: భద్రాచలం వద్ద శాంతిస్తోన్న గోదావరి.. 67.7 అడుగులకు నీటిమట్టం

TELANGANA FLOODS LIVE UPDATES
TELANGANA FLOODS LIVE UPDATES

By

Published : Jul 16, 2022, 7:29 AM IST

Updated : Jul 16, 2022, 10:21 PM IST

22:17 July 16

  • భద్రాచలం వద్ద గోదావరిలో క్రమంగా తగ్గుతున్న ఉద్ధృతి
  • భద్రాచలం వద్ద ప్రస్తుతం 67.7 అడుగులకు తగ్గిన నీటిమట్టం
  • నిన్నటి నుంచి ఇప్పటివరకు దాదాపు 3 అడుగుల మేర తగ్గిన నీటిమట్టం
  • భద్రాచలం వద్ద ప్రస్తుతం 22.41 లక్షల క్యూసెక్కుల ప్రవాహం
  • భద్రాచలం వద్ద కొనసాగుతున్న మూడో ప్రమాద హెచ్చరిక

21:22 July 16

భద్రాచలంకు అదనంగా పారిశుద్ధ్య యంత్రాలు, సిబ్బంది

  • భద్రాచలంకు అదనంగా పారిశుద్ధ్య యంత్రాలు, సిబ్బంది
  • ఇతర కార్పొరేషన్లు, మున్సిపాల్టీల నుంచి అదనపు సిబ్బంది, యంత్రాలు
  • భద్రాచలంకు 125 మంది అదనపు సిబ్బందిని పంపించాలని ఆదేశాలు
  • 10 జెట్టింగ్ యంత్రాలు, 15 మొబైల్ టాయిలెట్లు, 33 ఫాగింగ్ యంత్రాలు
  • యంత్రాలను వెంటనే పంపాలని మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలు
  • రేపు ఉదయం 7 గంటల వరకు భద్రాచలం చేరుకోవాలని ఆదేశాలు

19:41 July 16

భద్రాచలం వద్ద ప్రస్తుతం 68.2 అడుగులకు తగ్గిన నీటిమట్టం

  • భద్రాచలం వద్ద గోదావరిలో క్రమంగా తగ్గుతున్న ఉద్ధృతి
  • భద్రాచలం వద్ద గోదావరిలో కొద్దిమేర తగ్గిన నీటిమట్టం
  • భద్రాచలం వద్ద ప్రస్తుతం 68.2 అడుగులకు తగ్గిన నీటిమట్టం
  • నిన్నటి నుంచి ఇప్పటివరకు 3 అడుగుల మేర తగ్గిన నీటిమట్టం
  • భద్రాచలం వద్ద ప్రస్తుతం 22.70 లక్షల క్యూసెక్కుల ప్రవాహం
  • భద్రాచలం వద్ద కొనసాగుతున్న మూడో ప్రమాద హెచ్చరిక

16:50 July 16

  • భద్రాచలం వద్ద గోదావరిలో నెమ్మదిగా తగ్గుతున్న వరద
  • భద్రాచలం: ప్రస్తుతం గోదావరిలో 69.4 అడుగుల నీటిమట్టం
  • భద్రాచలం: గోదావరిలో ప్రస్తుతం 23.40 లక్షల క్యూసెక్కుల ప్రవాహం
  • భద్రాచలం వద్ద కొనసాగుతున్న మూడో ప్రమాద హెచ్చరిక

15:35 July 16

  • భద్రాచలం వద్ద గోదావరిలో తగ్గుముఖం పట్టిన వరద
  • భద్రాచలం: ప్రస్తుతం గోదావరిలో 69.7 అడుగుల నీటిమట్టం
  • భద్రాచలం: గోదావరిలో ప్రస్తుతం 23.58 లక్షల క్యూసెక్కుల ప్రవాహం

15:35 July 16

ఎమ్మెల్యే సీతక్కకు తప్పిన ప్రమాదం

ములుగు: ఎమ్మెల్యే సీతక్కకు తప్పిన ప్రమాదం

ముంపు ప్రాంతాల్లో నిత్యావసరాల పంపిణీకి పడవలో వెళ్లిన సీతక్క

వాగు మధ్యలో పెట్రోల్ అయిపోయి చెట్టుకు ఢీకొని ఆగిన పడవ

తర్వాత వాగు ఉద్ధృతికి ఒక వైపు ఒడ్డుకు కొట్టుకుపోయిన పడవ

పడవ నుంచి దిగి క్షేమంగా ఒడ్డుకు చేరిన ఎమ్మెల్యే సీతక్క

ములుగు: ఏటూరునాగారం మండలం ఎలిశెట్టిపెల్లి వాగులో ఘటన

నిత్యావసర సరుకులు పంపిణీ చేసి తిరిగి వస్తుండగా ఘటన

పడవలోని అందరూ క్షేమంగా బయటపడినట్లు అధికారుల వెల్లడి

14:39 July 16

గోదావరిలో కొద్దిమేర తగ్గిన నీటిమట్టం..

  • భద్రాచలం వద్ద కొనసాగుతున్న గోదావరి ప్రవాహం
  • భద్రాచలం వద్ద గోదావరిలో కొద్దిమేర తగ్గిన నీటిమట్టం
  • భద్రాచలం వద్ద ప్రస్తుతం 69.90 అడుగులకు తగ్గిన నీటిమట్టం
  • భద్రాచలం వద్ద నిన్న రాత్రి నుంచి 1.40 అడుగులు తగ్గిన నీటిమట్టం
  • భద్రాచలం వద్ద కొనసాగుతున్న మూడో ప్రమాద హెచ్చరిక

14:38 July 16

వరద ముంపు ప్రాంతాల్లో పరిస్థితిపై మంత్రి హరీశ్‌రావు సమీక్ష

  • హైదరాబాద్‌: వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు సమీక్ష
  • వరద ముంపు ప్రాంతాల్లో పరిస్థితిపై మంత్రి హరీశ్‌రావు సమీక్ష
  • వరద ప్రాంతాల వైద్యాధికారులు, వైద్యులతో హరీశ్‌రావు సమీక్ష
  • వరద ప్రాంతాల్లో అంటువ్యాధులను నివారించాలని హరీశ్‌రావు ఆదేశం
  • ముంపు గ్రామాల్లో వైద్యశిబిరాలు ఏర్పాటు చేయాలని హరీశ్‌రావు ఆదేశం
  • వైద్యులు సెలవులు తీసుకోకుండా తప్పనిసరిగా విధుల్లో ఉండాలన్న హరీశ్‌
  • బాధితులకు ఉచితంగా ఔషధాలు అందజేయాలని అధికారులకు ఆదేశం
  • డీహెచ్‌ శ్రీనివాసరావుకు కొత్తగూడెం పర్యవేక్షణ బాధ్యతలు
  • డీఈఎం రమేశ్‌రెడ్డికి మంచిర్యాల పర్యవేక్షణ బాధ్యతలు
  • జిల్లా అధికారులతో కలిసి పనిచేయాలని డీహెచ్‌, డీఈఎంకు ఆదేశాలు

13:05 July 16

  • ఆదిలాబాద్: ఇంద్రవెల్లి మం. వడగల్పూర్‌లో కలెక్టర్‌, ఎమ్మెల్యే పర్యటన
  • ఆటోలో కలెక్టర్‌ సిక్తాపట్నాయక్, ట్రాక్టర్‌పై ఎమ్మెల్యే రేఖానాయక్ పర్యటన
  • వరద బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్న కలెక్టర్‌, ఎమ్మెల్యే

12:39 July 16

భద్రాచలంలో వరద బాధితుల ధర్నా..

  • భద్రాచలం: సుభాష్‌నగర్ కాలనీలో వరద బాధితుల ధర్నా
  • సుభాష్‌నగర్ కాలనీ ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన
  • కరకట్ట ఎత్తు పెంచకపోవడంతో ఏటా ముంపునకు గురవుతున్నామని ఆవేదన
  • సమస్య పరిష్కరించాలని ప్రభుత్వానికి వరద బాధితుల విజ్ఞప్తి
  • ప్రభుత్వం హామీ ఇచ్చేవరకూ ధర్నా విరమించేది లేదన్న బాధితులు
  • వరద బాధితులకు మద్దతుగా ధర్నాలో పాల్గొన్న ఎమ్మెల్యే పోదెం వీరయ్య

12:39 July 16

  • ములుగు: మంగపేట మండలం పోదుమూరులో ఎర్రబెల్లి పర్యటన
  • పుష్కరఘాట్ పైభాగం కోతకు గురైన తీరప్రాంతాన్ని పరిశీలించిన ఎర్రబెల్లి
  • పునరావాస కేంద్రాల్లో వరద బాధితులను పరామర్శించిన ఎర్రబెల్లి
  • వరద బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్న మంత్రి ఎర్రబెల్లి

11:48 July 16

  • ములుగు జిల్లాలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పర్యటన
  • వ‌ర‌ద‌ల కార‌ణంగా దెబ్బతిన్న ప్రాంతాల‌ను ప‌రిశీలించిన ఎర్రబెల్లి
  • పూసూరు వంతెన వ‌ద్ద గోదావ‌రి ఉద్ధృతిని పరిశీలించిన ఎర్రబెల్లి
  • వాజేడులో నీటమునిగిన ఇళ్ల బాధితుల‌ను పరామర్శించిన ఎర్రబెల్లి
  • వరద ప్రభావంపై అధికారుల‌తో స‌మీక్ష నిర్వహించిన ఎర్రబెల్లి

10:35 July 16

  • శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు తగ్గుతున్న వరద ప్రవాహం
  • శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 46,510 క్యూసెక్కులు
  • శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఔట్‌ఫ్లో 16 వేల క్యూసెక్కులు
  • శ్రీరాంసాగర్ ప్రస్తుత నీటిమట్టం 1087.90 అడుగులు
  • శ్రీరాంసాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు
  • శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ప్రస్తుత నీటినిల్వ 76.10 టీఎంసీలు
  • శ్రీరాంసాగర్ పూర్తి నీటి నిల్వ సామర్ధ్యం 90.30 టీఎంసీలు

10:35 July 16

  • భద్రాచలం వద్ద ఉద్ధృతంగా కొనసాగుతున్న గోదావరి ప్రవాహం
  • భద్రాచలం వద్ద 70.70 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం
  • ప్రస్తుతం గోదావరిలో 24.13 లక్షల క్యూసెక్కుల ప్రవాహం
  • భద్రాచలం వద్ద కొనసాగుతున్న మూడో ప్రమాద హెచ్చరిక

10:03 July 16

  • భద్రాద్రి: వరద ముప్పు నుంచి తేరుకొని ఇల్లెందు సింగరేణి ప్రాంతం
  • వరద కారణంగా తొమ్మిది రోజులుగా నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి
  • టేకులపల్లి మండలం కోయగూడెం ఉపరితల గనిలో చేరిన వరద
  • వరద నీటిని భారీ మోటార్లతో బయటకు పంపిస్తున్న సిబ్బంది
  • నీటిని తోడేందుకు 24 గంటలు శ్రమిస్తున్న సిబ్బంది, అధికారులు
  • 9 రోజులుగా నిలిచిపోయిన 90వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి
  • నిలిచిన బొగ్గు ఉత్పత్తితో సింగరేణి సంస్థకు కోట్ల రూపాయల నష్టం

10:03 July 16

సీఎం కేసీఆర్‌ విహంగ వీక్షణం

  • రేపు గోదావరి నది ప్రాంతాల్లో సీఎం కేసీఆర్‌ విహంగ వీక్షణం
  • గోదావరి ప్రాంతాల్లో వరద పరిస్థితిని పరిశీలించనున్న సీఎం
  • రెండు, మూడు ప్రాంతాల్లో క్షేత్రస్థాయి సమీక్ష చేయనున్న సీఎం కేసీఆర్‌

09:56 July 16

  • జయశంకర్: కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద తగ్గిన వరద
  • కాళేశ్వరం పుష్కరఘాట్లు, శివారు ప్రాంతంలో ఉభయనదుల ప్రవాహం

09:56 July 16

  • జయశంకర్: వారం రోజులుగా జలదిగ్బంధంలో లోతట్టు గ్రామాలు
  • జలదిగ్బంధంలో మహాదేవపూర్, పలిమేల, మహాముత్తారం, కాటారం మండలాలు
  • విద్యుత్, వైద్యం, రవాణా, తాగునీరు లేక బాధితుల ఇక్కట్లు

08:29 July 16

  • శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు తగ్గుతున్న వరద ప్రవాహం
  • శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 47,215 క్యూసెక్కులు
  • శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఔట్‌ఫ్లో 40,984 క్యూసెక్కులు
  • శ్రీరాంసాగర్ ప్రస్తుత నీటిమట్టం 1087.90 అడుగులు
  • శ్రీరాంసాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు
  • శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ప్రస్తుత నీటినిల్వ 76.10 టీఎంసీలు
  • శ్రీరాంసాగర్ పూర్తి నీటి నిల్వ సామర్ధ్యం 90.30 టీఎంసీలు

08:28 July 16

  • భూపాలపల్లి: కాళేశ్వరం జలాశయానికి తగ్గిన వరద ప్రవాహం
  • మేడిగడ్డ బ్యారేజీ ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 16,71,388 క్యూసెక్కులు
  • మేడిగడ్డ బ్యారేజీ మొత్తం 85 గేట్ల ద్వారా నీటివిడుదల
  • అన్నారం బ్యారేజీ ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 4,58,489 క్యూసెక్కులు
  • అన్నారం బ్యారేజీ మొత్తం 66 గేట్ల ద్వారా నీటి విడుదల

08:26 July 16

  • భద్రాచలం వద్ద మహోగ్రంగా గోదావరి ప్రవాహం
  • భద్రాచలం వద్ద 70.90 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం
  • ప్రస్తుతం గోదావరిలో 24.24 లక్షల క్యూసెక్కుల ప్రవాహం
  • భద్రాచలం వద్ద కొనసాగుతున్న మూడో ప్రమాద హెచ్చరిక

07:26 July 16

జూరాలకు భారీగా వరదనీరు..

  • ఎగువ ఉన్న ప్రాజెక్టుల నుంచి జూరాలకు భారీగా వరదనీరు
  • జూరాల జలాశయం ఇన్‌ఫ్లో 1.45 లక్షల క్యూసెక్కులు
  • జూరాల ప్రాజెక్టు 23 గేట్ల ద్వారా 1,40 లక్షల క్యూసెక్కులు విడుదల
  • జూరాల జలాశయం ప్రస్తుత నీటినిల్వ 7.48 టీఎంసీలు
  • జూరాల జలాశయం పూర్తి నీటినిల్వ సామర్థ్యం 9.65 టీఎంసీలు
  • జూరాల జలాశయం ప్రస్తుత నీటి నిల్వ 7.72 టీఎంసీలు

07:25 July 16

గోదావరి ఉద్ధృత ప్రవాహం..

  • భద్రాచలం వద్ద గోదావరిలో కొనసాగుతున్న వరద ప్రవాహం
  • ప్రస్తుతం 71 అడుగుల వద్ద ప్రవహిస్తున్న గోదావరి నీటిమట్టం
  • గోదావరిలోకి 24.29 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం
  • నీటిమట్టం పెరగడంతో కరకట్టకు ఆనుకుని గోదావరి ఉద్ధృత ప్రవాహం
  • భద్రాచలం: అశోక్‌నగర్ కాలనీ, శాంతినగర్‌ కాలనీ జలదిగ్బంధం
  • అయ్యప్పకాలనీ, కొత్త కాలనీ, రామాలయం ప్రాంతం జలదిగ్బంధం
  • సుభాష్‌నగర్ కాలనీ, రాజుపేట కాలనీలోకి భారీగా చేరిన వరదనీరు
  • భద్రాచలం నుంచి ఇతర ప్రాంతాలకు 4 రోజులుగా స్తంభించిన రాకపోకలు
  • గోదావరి వంతెనపైనా రాకపోకలు నిలిపివేసిన అధికారులు
  • భద్రాచలం నాలుగువైపులా వరద చుట్టుముట్టడంతో పట్టణవాసుల ఇబ్బందులు
  • పునరావస కేంద్రాలకు చేరుకున్న వేలాదిమంది వరద బాధితులు

07:19 July 16

సుంకేశులకు పోటెత్తిన వరద..

  • గద్వాల: సుంకేశుల బ్యారేజ్‌కు పోటెత్తిన వరద
  • సుంకేశుల బ్యారేజ్‌కు 1.60 లక్షల క్యూసెక్కులు ప్రవాహం
  • 27 గేట్లు ఎత్తి దిగువకు 1.59 వేల క్యూసెక్కుల విడుదల
Last Updated : Jul 16, 2022, 10:21 PM IST

ABOUT THE AUTHOR

...view details