రాష్ట్రంలో అక్టోబరు నాటికి మద్యం దుకాణాల లైసెన్స్ గడువు ముగియాల్సి ఉండగా.. కొవిడ్ ప్రభావంతో ఈనెల చివరి నాటికి గడువు పొడిగించారు. దీంతో వచ్చే నెల ఒకటి నుంచి నూతన మద్యం పాలసీ అమల్లోకి రానుంది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.
350కిపైగా దుకాణాలు ఏర్పాటు..
లైసెన్స్ ఫీజు, దరఖాస్తు రుసుముల్లో అబ్కారీశాఖ ఎలాంటి మార్పులు చేయలేదు. ఇప్పుడున్న 2,216 మద్యం దుకాణాలకు అదనంగా మరో 350కిపైగా దుకాణాలు ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించింది. 2019 నవంబరు నుంచి 2021 అక్టోబరు వరకు రెండేళ్లలో జరిగిన మద్యం అమ్మకాల ఆధారంగా డిమాండ్ అధికంగా ఉండే ప్రాంతాల్లో ఈ 350 దుకాణాల ఏర్పాటుకు అంచనాలు సిద్ధం చేస్తోంది.
లాటరీ విధానంలోనే లైనెన్స్‌లు..
నూతన పాలసీలో మద్యం దుకాణాల్లో పదిశాతం ఎస్సీలకు, ఐదు శాతం ఎస్టీలకు, 15 శాతం గౌడ్‌లకు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే వీటిని కొత్త జిల్లా యూనిట్‌గా తీసుకొని కేటాయింపులు చేసేందుకు కలెక్టర్లకు అధికారం ఇచ్చింది. ఆయా జిల్లాల్లో ఉన్న దుకాణాలు ఆధారంగా ఈ కేటాయింపులు పూర్తి చేస్తారు. ఆయా వర్గాలకు కేటాయించిన దుకాణాలకూ లాటరీ విధానంలోనే లైనెన్స్లను ఎంపిక చేయనున్నారు. దరఖాస్తు రుసుం రెండు లక్షలుగా పేర్కొన్న ప్రభుత్వం లైసెన్స్‌లను ఆరు శ్లాబ్‌ల్లో జారీ చేయనుంది. లైసెన్స్‌లు పొందిన వారు ఏడాదికి ఒకసారి నిర్దేశించిన లైసెన్స్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
5 వేల జనాభా వరకు 50 లక్షలు, 5 వేల నుంచి 50 వేల వరకు జనాభా ఉంటే రూ.55 లక్షలు, 50 వేల నుంచి లక్ష వరకు జనాభా ఉంటే 60 లక్షలు లైసెన్స్ ఫీజు కట్టాల్సి ఉంటుంది. లక్ష నుంచి 5 లక్షల వరకు జనాభా ఉంటే 65 లక్షలు, 5 లక్షల నుంచి 20 లక్షలు వరకు జనాభా ఉంటే రూ.85 లక్షలు, 20 లక్షలకు మించి జనాభా ఉన్న ప్రాంతాల్లో లైసెన్స్ ఫీజు కోటి పది లక్షలుగా నిర్ణయించారు.
లైసెన్స్‌లకు గతంలో లైసెన్స్ ఫీజుకు ఏడు రెట్లు మించి అమ్మకాలు జరిపే మద్యంపై ప్రివిలేజ్ ఫీజు చెల్లించాల్సి ఉండేది. నూతన పాలసీలో పది రెట్లు టర్నోవర్ వరకు ఎలాంటి ప్రివిలేజి ఫీజు చెల్లించకుండా మినహాయింపు ఇచ్చారు. గతంలో ఫ్రివిలేజ్ ఫీజు కింద 13.6 శాతం చెల్లించాల్సి ఉండగా పది శాతానికి తగ్గించారు. ఒక వ్యక్తి ఒకే దరఖాస్తు విధానానికి స్వస్తి చెప్పి.. ఎన్నైనా చేసుకోవచ్చని కొత్త విధానంలో ప్రతిపాదించారు. గతంలో లైసెన్స్‌లకు .. రెండు బ్యాంక్ గ్యారంటీలు ఇవ్వాల్సి ఉండగా... ఇప్పుడు దీనిని ఒకటికి కుదించారు. ఏడాదికి నాలుగు సార్లు లైసెన్స్ ఫీజు చెల్లించాల్సి ఉండగా ఇపుడు ఆరు సార్లకు పెంచారు. ఈ నెలాఖరులోపు దుకాణాల లైసెన్స్‌ల ఎంపిక ప్రక్రియ పూర్తి కావాల్సి ఉండడంతో.... వీలైనంత త్వరగా దరఖాస్తుల స్వీకరణ, లాటరీ తేదీ వివరాలు ప్రకటించనుంది.
ఇదీచూడండి:liquor shop reservations మద్యం దుకాణాల రిజర్వేషన్లు.. ఎవరెవరికి ఎంతంటే..?