తెలంగాణ

telangana

ETV Bharat / city

పబ్‌ ఓనర్లకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ వార్నింగ్

Minister Srinivas Goud : హైదరాబాద్‌ మహానగరానికి చెడ్డపేరు వచ్చేలా చేస్తే పబ్‌లు మూసివేస్తామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. ప్రతి పబ్‌లో అన్ని వైపులా సీసీ కెమెరాలు ఉండాలన్న ఆయన.. నిబంధనలు ఉల్లంఘిస్తే అధికారులదే బాధ్యత అని స్పష్టం చేశారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, అధికారుల ప్రధాన లక్ష్యం రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ నిరోధించడమేనని తెలిపారు.

Minister Srinivas Goud
Minister Srinivas Goud

By

Published : Apr 9, 2022, 2:22 PM IST

పబ్‌ ఓనర్లకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ వార్నింగ్

Minister Srinivas Goud : బేగంపేట హరిత ప్లాజాలో ఎక్సైజ్ అధికారులు, పబ్ యజమానులతో సమావేశమైన మంత్రి.....పబ్‌లు, బార్లపై ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ ఆకస్మిక తనిఖీలుంటాయని వెల్లడించారు. నగరంలోని 61 పబ్‌లపై ప్రత్యేక నిఘా ఉంటుందని మంత్రి వివరించారు. డ్రగ్స్‌, గంజాయి డెలివరీ చేయొద్దని ఈ-కామర్స్ సంస్థలకు సూచించిన మంత్రి.. ఈమేరకు సంస్థలకు నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు.

Minister Srinivas Goud Warns Pub Owners : సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని గుడుంబారహితంగా మార్చారని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఉద్ఘాటించారు. తొలిదశలో పేకాట క్లబ్‌లను మూసివేయించారని తెలిపారు. ఇప్పుడు గంజాయి, డ్రగ్స్‌ నిరోధించడమే లక్ష్యంగా సీఎం చర్యలు తీసుకుంటున్నారని వెల్లడించారు. డ్రగ్స్‌ వెనుక ఎవరున్నా వదిలిపెట్టొద్దని సీఎం ఆదేశించినట్లు చెప్పారు. అందరిపైనా చట్ట ప్రకారం కఠిన చర్యలకు ఆదేశించారని అన్నారు.

"చట్టాన్ని అతిక్రమిస్తే పీడీ చట్టం ప్రయోగిస్తాం. నిజాయతీగా వ్యవహరిస్తేనే పబ్‌లకు అనుమతిస్తాం. నగరానికి చెడ్డ పేరు వచ్చేలా చేస్తే పబ్‌లు మూసివేస్తాం. ప్రతి పబ్‌లో అన్ని వైపులా సీసీ కెమెరాలు ఉండాలి. పబ్‌లు నిబంధనలు ఉల్లంఘిస్తే ఆబ్కారీ అధికారులదే బాధ్యత. పబ్‌లు, బార్లపై ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ ఆకస్మిక తనిఖీలుంటాయి. నగరంలోని 61 పబ్‌లపై ప్రత్యేక నిఘా ఉంటుంది."

- శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి

ABOUT THE AUTHOR

...view details