ఎడ్‌సెట్ తప్ప మిగతా ప్రవేశ పరీక్షలన్నీ సెప్టెంబరులోనే జరగనున్నాయి. ఈసెట్‌ను ఈనెల 31న, ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షలను సెప్టెంబరు 9, 10, 11, 14 తేదీల్లో జరుపుతామని ఇప్పటికే విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వద్ద జరిగిన సమావేశంలో సూత్రపాయంగా నిర్ణయించారు. ఎంసెట్ అగ్రికల్చర్, ఐసెట్, లాసెట్, పీఈసెట్‌ను సెప్టెంబరు 20-30 తేదీల మధ్య నిర్వహించాలని ఉన్నత విద్యామండలి యోచిస్తోంది. బీఈడీలో ప్రవేశాలకు నిర్వహించే ఎడ్‌సెట్‌ను మాత్రం అక్టోబరు మొదటి వారంలో జరపాలన్నది ఆలోచన. జేఈఈ మెయిన్, నీట్‌కు సుప్రీంకోర్టు పచ్చజెండా ఊపిన నేపథ్యంలో హైకోర్టు సైతం ప్రవేశ పరీక్షలకు అభ్యంతరం చెప్పదని అధికారులు భావిస్తున్నారు. ఒకట్రెండు రోజుల్లో పరీక్షల తేదీలను ప్రకటించనున్నారు.
ఇంజినీరింగ్‌కు 8.. అగ్రికల్చర్‌కు 4 విడతలు