తెలంగాణ

telangana

ETV Bharat / city

ప్రవేశపరీక్షల దరఖాస్తు గడుపు మరోసారి పొడిగింపు - ఎంసెట్ పరీక్షలు షెడ్యూలు

ప్రవేశపరీక్షల దరఖాస్తు గడువు మరోసారి పొడిగించింది రాష్ట్ర ఉన్నత విద్యామండలి. లాక్ డౌన్ కారణంగా ఇప్పటికే రెండు సార్లు దరఖాస్తు గడువు పొడిగించడంతో పాటు.. ఈ నెలలో జరగాల్సిన ప్రవేశపరీక్షలను వాయిదా వేసింది. లాక్​డౌన్​ ఎత్తివేసిన తర్వాత ప్రవేశపరీక్షల తేదీలను ఖరారు చేస్తారు.

emcet exam
emcet exam

By

Published : May 15, 2020, 7:27 PM IST

ఎంసెట్ సహా ప్రవేశ పరీక్షలన్నింటికి దరఖాస్తుల గడువును రాష్ట్ర ఉన్నత విద్యా మండలి మరోసారి పొడిగించింది. ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు చేసుకునే గడువు ఈనెల 31 వరకు పొడిగిస్తున్నట్లు ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ పాపిరెడ్డి తెలిపారు. ఎంసెట్, ఐసెట్, ఈసెట్, పీజీ ఈసెట్, లాసెట్, పీజీఎల్​సెట్, ఎడ్​సెట్, పీఈసెట్​లకు గడువు పొడిగించినట్లు తెలిపారు.

లాక్ డౌన్ కారణంగా ఇప్పటికే రెండు సార్లు దరఖాస్తు గడువు పొడిగిచడంతో పాటు.. ఈనెలలో జరగాల్సిన ప్రవేశపరీక్షలను వాయిదా వేశారు. లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత ప్రవేశ పరీక్షల తేదీలను ఖరారు చేయాలని ఉన్నత విద్యా మండలి భావిస్తోంది.

ఇదీ చదవండి:ఆపరేషన్​ చిరుత... ఎంతవరకు వచ్చిందంటే?

ABOUT THE AUTHOR

...view details