వాతావరణ కాలుష్యం ప్రపంచ మానవాళికి ప్రధాన సమస్యగా మారిందని తెలంగాణ ఇంధన శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా అన్నారు. ఇంధన పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ వాహనాల పాలసీని అందుబాటులోకి తీసుకొచ్చిందని తెలిపారు. యూనిట్ విద్యుత్‌ను ఆదా చేస్తే... ఒక యూనిట్ విద్యుత్‌ను ఉత్పత్తి చేయడంతో సమానమని వెల్లడించారు.
విద్యుత్ ఆదా.. ఉత్పత్తితో సమానం : సందీప్ సుల్తానియా
కాలుష్య నియంత్రణకు పౌరులుగా ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను నిర్వర్తించాలని రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా పేర్కొన్నారు. రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర ఇంధన పరిరక్షణ అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొన్నారు.
రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా
రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో రాష్ట్ర ఇంధన పరిరక్షణ అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ట్రాన్స్ కో జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావుతోపాటు సందీప్ కుమార్ సుల్తానియా ముఖ్య అతిథిగా హాజరయ్యారు.