TS EMCET POSTPONED: తెలంగాణ ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్‌ను ఉన్నత విద్యా మండలి వాయిదా వేసింది. ఇంజినీరింగ్ ఫీజుల విషయం కొలిక్కి రాకపోవడంతో సెప్టెంబర్ 28 నుంచి జరగాల్సిన కౌన్సెలింగ్‌ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. తిరిగి అక్టోబర్ 11 నుంచి రెండో విడత కౌన్సెలింగ్ ప్రారంభమవుతుందని వెల్లడించింది.
విద్యార్థులకు అలర్ట్.. తెలంగాణ ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్ వాయిదా - తెలంగాణ ఎంసెట్ వాయిదా
TS EMCET POSTPONED: సెప్టెంబర్ 28 నుంచి జరగాల్సిన ఎంసెట్ రెండో విడత కౌన్సిలింగ్‌ను వాయిదా వేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి తెలిపింది. తిరిగి అక్టోబర్ 11 నుంచి రెండో విడత కౌన్సిలింగ్ ప్రారంభమవుతుందని వెల్లడించారు..
టీఎస్ ఎంసెట్
అక్టోబర్ 11, 12న స్లాట్ బుకింగ్, అక్టోబర్ 12న ధ్రువప్రతాల పరిశీలన జరుగుతుందని పేర్కొంది. అక్టోబరు 12, 13న వెబ్ అప్షన్ల నమోదు ప్రక్రియ, అక్టోబరు 16న సీట్లను కేటాయిస్తామని ప్రకటనలో తెలిపింది. కావున విద్యార్థులు ఈ ప్రకటనను గమనించాలి.
ఇవీ చదవండి: