విద్యుత్ యాజమాన్యంతో ఉద్యోగ సంఘాల చర్చలు సఫలం - తెలంగాణ విద్యుత్ కార్మికుల సమ్మె
విద్యుత్ కార్మిక సంఘాల డిమాండ్లపై యాజమాన్యం సానుకూలంగా స్పందించిందని ఉద్యోగసంఘాల నేతలు తెలిపారు. సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేసినట్లు నాయకులు చెప్పారు.
విద్యుత్ సంస్థల సీఎండీలతో విద్యుత్ ఉద్యోగ సంఘాలు చర్చలు జరిపాయి. హైదరాబాద్ ఖైరతాబాద్‌లోని విద్యుత్‌సౌదలో జరిగిన ఈ చర్చల్లో సీఎండీలు ప్రభాకర్‌రావు, రఘురామ్‌రెడ్డి, గోపాల్‌రావు పాల్గొన్నారు. ఆర్టిజన్‌ల డిమాండ్ల పరిష్కారానికి యాజమాన్యం ఒప్పుకుందని సంఘం నేతలు తెలిపారు. తమ డిమాండ్ల పట్ల యాజమాన్యం సానుకూలంగా స్పందించినందున సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు విద్యుత్ కార్మిక సంఘాలు వెల్లడించాయి. నవంబర్ మూడోవారంలో మరోసారి యాజమాన్యంతో చర్చలు జరపనున్నట్లు కార్మిక నేతలు తెలిపారు.
- ఇదీ చూడండి : "స్థానికేతరులంతా హుజూర్నగర్ వదిలివెళ్లాలి"