తెలంగాణ

telangana

ETV Bharat / city

విద్యుత్​ సవరణ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం: జగదీశ్​రెడ్డి - కేంద్ర విద్యుత్​ శాఖ మంత్రి వీడియో కాన్ఫరెన్స్

కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న విద్యుత్​ సవరణ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు విద్యుత్​ శాఖ మంత్రి జగదీశ్​రెడ్డి తెలిపారు. సవరణతో వినియోగదారులు, రైతులు నష్టపోతారని అభిప్రాయపడ్డారు. ఇదే విషయమై ప్రధానికి ముఖ్యమంత్రి కేసీఆర్​ లేఖరాశారని మంత్రి గుర్తుచేశారు. అన్నిరాష్ట్రాల విద్యుత్ శాఖ మంత్రులతో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కేసింగ్ నిర్వహించిన దృశ్యమాధ్యమ సమీక్షలో జగదీశ్​ రెడ్డితో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

telangana electricity minister
విద్యుత్​ సవరణ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం: జగదీశ్​రెడ్డి

By

Published : Jul 3, 2020, 3:59 PM IST

విద్యుత్​ సవరణ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం: జగదీశ్​రెడ్డి

విద్యుత్ సవరణ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వానికి మరోమారు స్పష్టం చేశామని మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు. సవరణ చట్టం వినియోగదారుల ప్రయోజనాలు, రాష్ట్రాల హక్కులకు భంగం కలిగిస్తుందని అభిప్రాయపడ్డారు.

గతంలోనే చెప్పాం..

అన్ని రాష్ట్రాల విద్యుత్ శాఖ మంత్రులతో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కేసింగ్ నిర్వహించిన దృశ్యమాధ్యమ సమీక్షలో జగదీశ్​ రెడ్డితో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. విద్యుత్ చట్టంపై రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని గతంలోనే స్పష్టంగా చెప్పామన్నారు. ఇదే విషయమై ముఖ్యమంత్రి కేసీఆర్​.. ప్రధానికి లేఖ రాశారని మంత్రి గుర్తుచేశారు.

ముసాయిదా అందలేదు..

సవరణ చట్టం.. రాష్ట్రానికి, ప్రజలకు ఉపయోగపడేలా లేదని, రాయితీలు పొందే వారికి, రాష్ట్ర రైతులకు తీవ్ర నష్టం కలుగజేస్తుందని తెలిపారు. ఇతర రాష్ట్రాలూ ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాయని... కేరళ, రాజస్థాన్, పశ్చిమ బంగ, పంజాబ్​ కూడా తెలంగాణ రాష్ట్ర అభిప్రాయాలతో ఏకీభవించాయని జగదీశ్​రెడ్డి తెలిపారు. రాష్ట్రాల అభ్యంతరాలతో ఈఆర్సీ నియామక నిబంధనల్లో మార్పులు చేశామని కేంద్రం ప్రకటన జారీ చేసినా.. మార్చినట్లు ముసాయిదా అందలేదన్నారు.

భద్రాద్రి రెండో యూనిట్​ ప్రారంభం..

కొవిడ్ వల్ల ఇబ్బందుల్లో ఉన్న డిస్కంలకు 9.5 శాతం వడ్డీతో అప్పు ఇస్తామని కేంద్రం చెప్పిందని.. 8.5శాతం వడ్డీతో ఇస్తే బాగుంటుందని తాము సూచించినట్లు చెప్పారు. భద్రాద్రి పవర్ ప్లాంట్ రెండో యూనిట్ అనుసంధానంతో 270 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైందని జగదీశ్​రెడ్డి తెలిపారు. కొందరు న్యాయస్థానాల్లో కేసులు వేయడం వల్ల కొంత ఆలస్యమైందన్నారు. నెల, నెలన్నర రోజుల్లో మూడో యూనిట్​ను ప్రారంభిస్తామని మంత్రి జగదీశ్​రెడ్డి పేర్కొన్నారు. కరోనా ప్రభావంతో కార్మికులు సొంత ప్రాంతాలకు వెళ్లారని... త్వరలోనే పూర్తిస్థాయిలో 1080 మెగావాట్లు సామర్థ్యంతో భద్రాద్రి పవర్​ ప్లాంట్​లో విద్యుత్​ ఉత్పత్తి ప్రారంభిస్తామని తెలిపారు.

ఇవీచూడండి:హరితహారంతో ఆకుపచ్చ తెలంగాణ: ఇంద్రకరణ్​ రెడ్డి

ABOUT THE AUTHOR

...view details