రాష్ట్రంలో ఐదు పార్టీలకు కామన్ గుర్తులను కేటాయిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం సర్కులర్ విడుదల చేసింది. జనసేన పార్టీకి గాజు గ్లాసు, హిందూస్థాన్ జనతాపార్టీకి కొబ్బరి తోట గుర్తు, ఇండియా ప్రజాబంధు పార్టీకి ట్రంఫెట్, మార్క్సిస్టు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా యునైటెడ్ పార్టీకి గ్యాస్ సిలిండర్, ఇండియన్ ప్రజాకాంగ్రెస్ పార్టీకి విజిల్ గుర్తు కేటాయించారు.
ఐదేళ్ల వరకు ఈ గుర్తులు ఆయా పార్టీలకే ఉంటాయని.. రాబోయే ఐదేళ్లలో స్థానిక సంస్థలు, సాధారణ ఎన్నికల్లో 10 శాతం సీట్లలో పోటీచేయని పక్షంలో కేటాయించిన గుర్తులు రద్దవుతాయని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఐదేళ్ల కాలం ముగిసేవరకు తిరిగి దరఖాస్తు చేసే అవకాశాన్ని కోల్పోతారని పేర్కొంది. వారికి కేటాయించిన గుర్తులు ఆ పార్టీ తరఫున పోటీచేసే స్థానాల వరకే పరిమితమని.. పోటీ చేయని స్థానాల్లో ఇతర పార్టీలు లేదా స్వతంత్ర అభ్యర్థులకు వాటిని కేటాయిస్తామని స్పష్టం చేసింది.