Sabitha IndraReddy Latest News : ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో విద్యాయజ్ఞం మొదలైందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. విద్యాయజ్ఞంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. ప్రతి ఒక్కరూ బడి రుణం తీర్చుకునేందుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. విద్యాయజ్ఞం విజయవంతమయ్యేలా అందరూ కృషి చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన మన ఊరు-మన బడి, మన బస్తీ- మన బడి పథకాలపై పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు.
Sabitha IndraReddy in Assembly 2022 : "పాఠశాలల అభివృద్ధికి దాతలు ముందుకు రావాలి. పాఠశాలలో తరగతి గదులు, నిర్మాణాలకు దాతల పేర్లు పెడతాం. రూ.10 లక్షలు విరాళమిస్తే తరగతి గదికి దాత పేరు పెడతారు. రూ.25 లక్షలు విరాళమిస్తే ప్రాథమిక పాఠశాలకు.. రూ.50 లక్షలు విరాళమిస్తే ప్రాథమికోన్నత పాఠశాలకు.. రూ.కోటి విరాళమిస్తే ఉన్నత పాఠశాలకు దాత పేరు పెడతాం."