తెలంగాణ

telangana

ETV Bharat / city

జాతీయ విద్యా విధానం అమలుకు రాష్ట్ర విద్యా శాఖ కసరత్తు - జాతీయ విద్యా విధానం అమలుకు రాష్ట్ర విద్యా శాఖ కసరత్తు

జాతీయ విద్యా విధానం అమలుకు ప్రణాళిక, రోడ్ మ్యాప్ పంపించాలని వివిధ విభాగాలను రాష్ట్ర విద్యాశాఖ కోరింది. నూతన విద్యా విధానం అమలుకు ఎలాంటి యంత్రాంగం అవసరం, కరికులమ్ ఎలా ఉండాలని అడిగింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు జాతీయ విద్యా విధానంపై అభిప్రయాలు తెలపాలని జిల్లా అధికారులు, అధ్యాపకుల సంఘాలను ఇంటర్మీడియట్ బోర్డు కోరింది.

education
education

By

Published : Sep 28, 2020, 5:39 PM IST

జాతీయ విద్యా విధానం అమలుకు అవసరమైన ప్రణాళిక కోసం రాష్ట్ర విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. వివిధ భాగస్వాములతో చర్చించి.. ప్రణాళిక, రోడ్ మ్యాప్ పంపించాలని వివిధ విభాగాలను కోరింది. నూతన విద్యా విధానంలోని 5 ప్లస్, 3 ప్లస్, 3 ప్లస్ 4 విధానం అమలుకు ఎలాంటి యంత్రాంగం అవసరం, కరికులమ్ ఎలా ఉండాలని అడిగింది.

టీచింగ్, లెర్నింగ్‌లో సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, మల్టీ డిసిప్లినరీ విద్యా విధానం, కోర్సుల ఎంపికలో అవకాశాలు, బహు భాషలు, భాషల శక్తి, వొకేషనల్ విద్య బలోపేతం, స్థానిక అంశాలతో జాతీయ పాఠ్యపుస్తకాలు తదితర అంశాలపై ప్రణాళికలు రూపొందించాలని పేర్కొంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు జాతీయ విద్యా విధానంపై అభిప్రాయాలు తెలపాలని జిల్లా అధికారులు, అధ్యాపకుల సంఘాలను ఇంటర్మీడియట్ బోర్డు కోరింది. రేపటిలోగా అభిప్రాయాలను మెయిల్‌కు పంపించాలని ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ లేఖలు రాశారు.

ఇదీ చదవండి :కరోనా​ను నశింపజేసే నమూనా తయారు చేసిన బీటెక్ విద్యార్థి

ABOUT THE AUTHOR

...view details