ఎంసెట్ ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌లో భాగంగా నేటి నుంచి ధ్రువపత్రాల పరిశీలన జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా 36 సహాయ కేంద్రాలలో అధికారులు ధ్రువపత్రాలను పరిశీలించనున్నారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం ఇప్పటివరకు 35,824 మంది స్లాట్లు బుక్ చేసుకున్నారు. ఈనెల 19వరకు స్లాట్ల బుకింగ్‌కు గడువు ఉంది. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా సుమారు 9 వేల మంది పత్రాల పరిశీలనకు హాజరుకానున్నారు.
ఎంసెట్ కౌన్సెలింగ్: నేటి నుంచి ధ్రువపత్రాల పరిశీలన - నేటి నుంచి ధ్రువపత్రాల పరిశీలన
ఎంసెట్ ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌లో భాగంగా నేటి నుంచి ధ్రువపత్రాల పరిశీలన జరగనుంది. 36 సహాయ కేంద్రాల్లో.. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 9 వేల మంది పత్రాల పరిశీలనకు హాజరుకానున్నారు.
ఇంజనీరింగ్‌లో కొత్త కోర్సులు, కళాశాలల అనుబంధ గుర్తింపు ప్రక్రియ కొలిక్కి రానందున.. నేటి నుంచి జరగాల్సిన వెబ్ ఆప్షన్ల నమోదు వాయిదా వేశారు. వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియను నాలుగు రోజులకు కుదించి.. ఈనెల 18 నుంచి 22 వరకు చేపట్టేలా షెడ్యూల్‌ను సవరించారు. ఇంజనీరింగ్ మొదటి విడత సీట్లను ఈనెల 22న కేటాయించాలని గతంలో నిర్ణయించినప్పటికి.. తాజా మార్పుల నేపథ్యంలో ఈనెల 24న కేటాయించనున్నట్లు.. ప్రవేశాల కన్వీనర్, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ తెలిపారు.
ఇవీ చూడండి:ఎంసెట్ కౌన్సెలింగ్ షెడ్యూలులో మార్పులు