తెలంగాణ

telangana

By

Published : Sep 21, 2020, 2:49 PM IST

Updated : Sep 21, 2020, 9:34 PM IST

ETV Bharat / city

డిగ్రీ మొదటి విడత సీట్ల కేటాయింపు

dosth
dosth

14:48 September 21

డిగ్రీ మొదటి విడత సీట్ల కేటాయింపు

డిగ్రీ మొదటి విడత సీట్లు కేటాయింపు పూర్తయింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది దోస్త్ ద్వారా.. 982 కాలేజీల్లోని 174 కోర్సుల్లో 4,07,390 సీట్ల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. మొదటి విడతలో గతేడాది 1,21,363 మంది నమోదు చేసుకోగా.. ఈ ఏడాది 1,71,275 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకున్నారు. కరోనా ప్రభావం వల్ల ఈ ఏడాది అత్యధికంగా మొబైల్ ఫోన్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. గతేడాది ఆధార్ అనుసంధాన మొబైల్ ద్వారా 35 శాతం మంది నమోదు చేసుకోగా.. ఈ ఏడాది సగానికి పైగా అంటే 51 శాతం ఆ పద్ధతిలో రిజిస్టర్ చేసుకున్నారని దోస్త్ కన్వీనర్ లింబాద్రి తెలిపారు. .

ఎక్కువ శాతం మందికి కోరుకున్న సీటే

రాష్ట్రవ్యాప్తంగా 1,53,323 మంది వెబ్ ఆప్షన్లు ఇవ్వగా.. వారిలో 92.18శాతం మందికి  1,41,340 మందికి ఇవాళ డిగ్రీ సీట్లు దక్కాయి. వారిలో అమ్మాయిలు 76,173 మంది కాగా.. అబ్బాయిలు 65,167 మంది ఉన్నారు. వెబ్ ఆప్షన్లు ఇచ్చిన వారిలో కేవలం 7.82 శాతం.. 11,983 మంది విద్యార్థులకు సీటు రాలేదు. మొదటి విడతలో 76.62 శాతం అంటే 1,08,289 మందికి వారి కోరుకున్న తొలి ప్రాధాన్య సీటే దక్కింది. మిగతా 23.18శాతం.. 32,769 మందికి రెండో ప్రాధాన్య సీటు వచ్చింది. ప్రభుత్వ కాలేజీల్లో 282 మందికి సీటు లభించింది.

కామర్స్​ కోర్సులకు డిమాండ్

డిగ్రీలో కామర్స్ కోర్సులకు ఈ ఏడాది ఎక్కువ డిమాండ్ కనిపిస్తోంది. అత్యధికంగా 37.73 శాతం.. 53,327 మంది కామర్స్​లో చేరగా.. ఫిజికల్ సైన్స్​లో 25.01శాతం.. 35,349 మంది.. లైఫ్ సైన్సెస్​లో 20.80శాతం.. 29,401 మంది.. ఆర్ట్స్​లో 12.39శాతం 17,508 మంది.. డీ ఫార్మసీలో 217.. ఇతర కోర్సుల్లో 5,538 మంది సీట్లు పొందారు. ఈ ఏడాది కొత్తగా ప్రవేశ పెట్టిన బీఎస్సీ డేటా సైన్సులో 6,780 సీట్లు ఉండగా.. మొదటి విడతలో 2,598 మంది సీట్లు పొందారు. సీట్లు పొందిన అభ్యర్థులకు ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం ఇచ్చినట్లు దోస్త్ కన్వీనర్ లింబాద్రి తెలిపారు.  

సెల్ఫ్​ రిపోర్టింగ్​ చేయకపోలే.. సీటు రద్దు

సీటు దక్కిన వారు ఈనెల 26 వరకు దోస్త్ వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్​లో కాలేజీలో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని పేర్కొన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలు 500 రూపాయలు, ఓసీలు వెయ్యి రూపాయలు చెల్లించి సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తే సీటు రిజర్వ్ అవుతుందని.. ఆ తర్వాత అవసరమైతే మెరుగైన సీటు కోసం రెండో విడతలోనూ ప్రయత్నించవచ్చునన్నారు. సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోతే.. కేటాయించిన సీటు రద్దువుతుందని కన్వీనర్ స్పష్టం చేశారు. అక్టోబరు 10 నుంచి 15 మధ్య కాలేజీలో రిపోర్టు చేయాల్సి ఉంటుంది.  

నేటి నుంచి రెండో విడత

మొదటి విడత కేటాయింపుల అనంతరం రాష్ట్రంలో 2,66,050 డిగ్రీ సీట్లు మిగిలాయి. నేటి నుంచి రెండో విడత దోస్త్ రిజిస్ట్రేషన్లు, వెబ్ ఆప్షన్లు చేసుకోవచ్చునని లింబాద్రి తెలిపారు. ఈ ఏడాది ఇంటర్​లో 99.20శాతం మార్కులు పొందిన జి.వైష్ణవి దోస్త్​కు దరఖాస్తు చేసుకున్న వారిలో మొదటి స్థానంలో నిలిచి కోఠి మహిళ కాలేజీలో సీటు పొందగా.. ఇంటర్​లో 99.10 సాధించిన కె.అనిల్ కుమార్ దోస్త్ దరఖాస్తుదారుల్లో రెండో స్థానంలో నిలిచి నిజాం కాలేజీలో సీటు దక్కించుకున్నాడు. ఇంటర్​లో 98.80 సాధించిన కమ్మరి శ్రావణి, 98.60 సాధించిన నిశాంత్.. ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో సీటు పొందారు.

ఇదీ చదవండి :వైద్య ఆరోగ్య శాఖ నూతన విధానాలకు సిద్ధం కావాలి: ఈటల

Last Updated : Sep 21, 2020, 9:34 PM IST

ABOUT THE AUTHOR

...view details