తెలంగాణ

telangana

ETV Bharat / city

విశాఖలో కృష్ణా బోర్డు కార్యాలయం ఏర్పాటుకు తెలంగాణ నో

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేయడం తమకు సమ్మతం కాదని తెలంగాణ పేర్కొంది. ఈ మేరకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు లేఖ రాసింది. కృష్ణా బేసిన్‌కు బయట, సంబంధంలేని ప్రాంతంలో ఏర్పాటుపై అభ్యంతరం వ్యక్తం చేసింది.

krishna board
krishna board

By

Published : Jan 19, 2021, 9:00 AM IST

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కార్యాలయం విజయవాడలో ఏర్పాటు చేస్తామంటే అంగీకారం తెలిపామని తెలంగాణ పేర్కొంది. కృష్ణా బేసిన్‌కు బయట, సంబంధం లేని ప్రాంతంలో ఏర్పాటు చేయడం వల్ల కార్యకలాపాలకు ఇబ్బందవుతుందని అభిప్రాయపడింది. అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీలో కూడా ఈ విషయం చర్చించకుండా అకస్మాత్తుగా విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తామని చెప్పడం సరైంది కాదంది. ఈ మేరకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఛైర్మన్‌కు తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ మురళీధర్‌ సోమవారం లేఖ రాశారు.

కృష్ణా బోర్డు, అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతి లేకుండా ఆంధ్రప్రదేశ్‌ మరికొన్ని ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టినట్లు కూడా బోర్డు దృష్టికి తెలంగాణ తెచ్చింది. ఇటీవల పరిపాలనా అనుమతి ఇచ్చిన మూడు ప్రాజెక్టుల గురించి వివరించినట్లు తెలిసింది.

ఇదీ చదవండి:తెలంగాణలో ప్రాంతీయ విమానాశ్రయాలకు సానుకూలం

ABOUT THE AUTHOR

...view details