తెలంగాణ

telangana

ETV Bharat / city

45 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే కరోనా టీకాలు: డీహెచ్​ - corona vaccination in telangana

రాష్ట్రంలో వ్యాక్సినేషన్​పై డైరెక్టర్​ ఆఫ్​ హెల్త్​ శ్రీనివాసరావు స్పష్టత నిచ్చారు. ప్రస్తుతం 45 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే టీకాలు వేస్తున్నట్లు వెల్లడించారు.

vaccination in telangana
తెలంగాణలో కరోనా వ్యాక్సినేషన్​ వార్తలు

By

Published : May 3, 2021, 10:13 AM IST

Updated : May 3, 2021, 10:26 AM IST

రాష్ట్రంలో 45 ఏళ్లు దాటిన వారికి మాత్రమే కరోనా టీకా ఇస్తున్నట్లు డైరెక్టర్​ ఆఫ్​ హెల్త్ శ్రీనివాసరావు వెల్లడించారు. ఆన్‌లైన్‌లో ముందుగా రిజిస్టర్‌ చేసుకున్నవారికే వ్యాక్సినేషన్‌ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ముందుగా రిజిస్ట్రేషన్‌ చేసుకోకుండా నేరుగా వ్యాక్సినేషన్‌ కేంద్రాలకు వచ్చే వారికి టీకాలు ఇవ్వడం లేదని తెలిపారు.

జీహెచ్‌ఎంసీలో ప్రభుత్వ కేంద్రాల్లోనే వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. గ్రేటర్​ హైదరాబాద్​ పరిధిలో ఒక్కో కేంద్రంలో రోజుకు 200 మందికి, మిగిలిన ప్రాంతాల్లో ఒక్కో కేంద్రంలో రోజుకు 100 మందికి మాత్రమే టీకాలు వేస్తున్నట్లు తెలిపారు.

ఇవీచూడండి:రాష్ట్రంలో కొత్తగా 5,695 కరోనా కేసులు, 49 మరణాలు

Last Updated : May 3, 2021, 10:26 AM IST

ABOUT THE AUTHOR

...view details