రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేస్తామని డీజీపీ మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజా భద్రత కోసమే కఠిన నిర్ణయాలు అమలు చేయాల్సి వచ్చిందని అన్నారు. చట్టాలు కఠినంగా అమలు చేసిన నగరాల్లో కరోనా నియంత్రణలో ఉందని వివరించారు. రాత్రి 7 గంటల వరకే కిరాణా, కూరగాయల దుకాణాలు, పెట్రోల్ బంకులకు అనుమతి ఉంటుందని తెలిపారు.
లాక్‌డౌన్ అమలుపై పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చాం. చెక్‌పోస్టుల వద్ద వాహనాలు పట్టుబడితే సీజ్ చేస్తాం. రోడ్లపైకి వచ్చేందుకు ఆటోలు, ట్యాక్సీలకు కూడా అనుమతి లేదు. లాక్‌డౌన్ పూర్తయిన తర్వాత తదుపరి నిర్ణయాలను వెల్లడిస్తాం. మన భవిష్యత్ కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అందరూ సహకరించాలి. నిబంధనలు అతిక్రమిస్తే ఆటోలను సీజ్ చేస్తాం. లాక్‌డౌన్‌ను అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయి.