తెలంగాణ

telangana

ETV Bharat / city

త్వరలోనే.. ముఖ్యమంత్రిగా కేటీఆర్ బాధ్యతలు: పద్మారావు గౌడ్ - deputy speaker padma rao about ktr becoming cm

అతిత్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేటీఆర్ బాధ్యతలు చేపట్టనున్నారని డిప్యూటీ స్పీకర్ పద్మారావు అన్నారు. సికింద్రాబాద్​లో దక్షిణ మధ్య రైల్వే ఉద్యోగుల సంఘం డివిజన్ కార్యాలయ ప్రారంభోత్సవంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

telangana deputy speaker padma rao goud about ktr becoming chief minister
త్వరలోనే.. రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేటీఆర్ బాధ్యతలు

By

Published : Jan 21, 2021, 1:59 PM IST

త్వరలోనే తెలంగాణ ముఖ్యమంత్రిగా కేటీఆర్ బాధ్యతలు స్వీకరిస్తారని ఉపసభాపతి పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్​లో దక్షిణ మధ్య రైల్వే ఉద్యోగుల సంఘం డివిజన్​ కార్యాలయ ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్​తో కలిసి పాల్గొన్నారు.

కేటీఆర్​కు పద్మారావు శుభాకాంక్షలు తెలపడం.. ఆయణ్ను ముఖ్యమంత్రి చేస్తారనే ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తున్నాయి. గత రెండు రోజులుగా తెరాస మంత్రులు, ఎమ్మెల్యేలు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కేటీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక.. రైల్వే కార్మికులకు ఇబ్బందులు తలెత్తకుండా కాపాడాలని పద్మారావు కోరారు.

త్వరలోనే.. రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేటీఆర్ బాధ్యతలు

ABOUT THE AUTHOR

...view details