Telangana Debts: కొవిడ్ మహమ్మారి వల్ల అన్ని రంగాల కార్యకలాపాలు బాగా దెబ్బతిన్నాయి. ఆయా రంగాల్లో లావాదేవీలు తగ్గడంతో సర్కార్ ఖజానాకు వచ్చే ఆదాయం తగ్గింది. దీంతో నిధుల సమీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం అప్పులపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. రుణపరిమితి చట్టానికి (FRBM) లోబడి రాష్ట్ర ప్రభుత్వం బహిరంగ మార్కెట్లో రుణాలు తీసుకోవచ్చు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి - జీఎస్డీపీ ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం అప్పు తీసుకోవచ్చు. అందుకు అనుగుణంగా 2021 - 22 ఆర్థికసంవత్సరంలో 47,500 కోట్ల రూపాయలు రుణంగా తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రతిపాదించింది.
జనవరి నెలలో ఎంతంటే?
ఇప్పటి వరకు 39,036 కోట్ల రూపాయలు అప్పుగా తీసుకొంది. దానికి అదనంగా తాజాగా మరో రెండు వేల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం రుణంగా తీసుకునేందుకు సిద్ధమైంది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. 2000 కోట్ల రూపాయల విలువైన బాండ్లను రిజర్వ్ బ్యాంకు ద్వారా వేలం వేయనుంది. 12 ఏళ్ల కాలపరిమితికి బాండ్లను విక్రయించనుంది. ఈ బాండ్లను ఆర్బీఐ ఈ నెల 18న వేలం వేయనుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ రుణం 41వేల కోట్ల రూపాయలు దాటనుంది. జనవరి నెలలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే రుణం ఆరు వేల కోట్ల రూపాయలు అవుతుంది.
పంట పెట్టుబడి సాయంగా