ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా సమన్వయంతో పనిచేయాలి : సీఎస్ - తెలంగాణ వర్షాలు
18:01 August 15
ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా సమన్వయంతో పనిచేయాలి : సీఎస్
సీఎం ఆదేశాల మేరకు వర్షాలు, వరదలపై జిల్లా కలెక్టర్లతో సీఎస్ సోమేశ్ కుమార్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. కొద్దిరోజులు వర్షసూచన ఉన్నందున పూర్తి అప్రమత్తంగా ఉండాలని సీఎస్ ఆదేశించారు. అధికారులందరూ హెడ్‌క్వార్టర్స్‌లోనే ఉండాలని పేర్కొన్నారు. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
దెబ్బతినే అవకాశమున్న చెరువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. చెరువులు పూర్తిగా నిండిన చోట గండ్లు పడకుండా చూడాలన్నారు. జిల్లాల్లో 24 గంటలు పనిచేసేలా కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని తెలిపారు. పట్టణాలు, గ్రామాల్లో పారిశుద్ధ్యంపై దృష్టి సారించాలని కలెక్టర్లకు సీఎస్ సూచించారు.
రాష్ట్రస్థాయిలో కంట్రోల్ రూమ్‌ను అధికారులు ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూమ్ నంబర్ 040-23450624.