తెలంగాణ

telangana

ETV Bharat / city

Covid Vaccination in Hyd: హైదరాబాద్​లో సెకండ్ డోస్... 150 మొబైల్ వ్యాక్సిన్ కేంద్రాల్లో... - corona vaccination in telangana

జీహెచ్​ఎంసీ పరిధిలో రెండో డోస్​ వ్యాక్సిన్​ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినట్లు సీఎస్​ సోమేశ్​కుమార్​ తెలిపారు. 150 మొబైల్​ వ్యాక్సిన్​​ కేంద్రాల ద్వారా టీకాల పంపిణీ చేపట్టినట్లు పేర్కొన్నారు. రాజేంద్ర నగర్​ సర్కిల్ పరిధిలోని సన్​రైజ్​ హోమ్​ కాలనీలో ఏర్పాటు చేసిన మొబైల్ వ్యాక్సిన్ కేంద్రాన్ని సీఎస్​ పరీశీలించారు.

corona vaccination in hyderabad
corona vaccination in hyderabad

By

Published : Oct 30, 2021, 5:16 PM IST

గ్రేటర్ హైదరాబాద్​ పరిధిలో నేటి నుంచి ప్రారంభించిన కరోనా రెండో డోస్​ వ్యాక్సిన్​ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​కుమార్ సూచించారు. నగరంలోని రాజేంద్ర నగర్​ సర్కిల్ పరిధిలోని సన్​రైజ్​ హోమ్​ కాలనీలో ఏర్పాటు చేసిన మొబైల్ వ్యాక్సిన్ కేంద్రాన్ని సీఎస్ సోమేశ్ కుమార్ పరిశీలించారు. వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వీ, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్​కుమార్​ పాల్గొన్నారు.

రాష్ట్రంలో ఇప్పటికే మూడు కోట్లకు పైగా కొవిడ్ వ్యాక్సిన్​లను అందచేశామని సీఎస్ తెలిపారు. కరోనా నివారణకు కేవలం వ్యాక్సిన్ తీసుకోవడమే మార్గమని పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలో సుమారు 90 శాతం ప్రజలకు వ్యాక్సినేషన్​ చేశామన్నారు.. వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వీ. నేటి నుంచి పది రోజులపాటు 150 మొబైల్ వ్యాక్సిన్​ కేంద్రాల ద్వారా కరోనా వ్యాక్సిన్​ రెండో డోస్​ వేస్తున్నట్లు వివరించారు. నగరంలో రెండు, మూడు కాలనీలకు ఒక మొబైల్​ వ్యాక్సిన్ కేంద్రం వద్ద టీకా పంపిణీ చేస్తున్నట్లు జీహెచ్​ఎంసీ కమిషనర్ లోకేశ్​కుమార్​ తెలిపారు. రోజూ దాదాపు 450 కాలనీలను కవర్ చేస్తామన్నారు. అవసరమైతే వాక్సినేషన్ కార్యక్రమాన్ని మరికొన్ని రోజులు పొడిగిస్తామని పేర్కొన్నారు.

ఇదీచూడండి:చిన్నారులకు ఫైజర్​ టీకా పంపిణీకి ఆమోదం

ABOUT THE AUTHOR

...view details