తెలంగాణ

telangana

ETV Bharat / city

ఆరు నెలల్లో సంపూర్ణ అక్ష్యరాస్యత సాధిస్తాం: సీఎస్​

రాష్ట్రంలో నిరక్షరాస్యుల జాబితా సిద్ధం చేస్తున్నామని సీఎస్​ సోమేశ్ కుమార్ తెలిపారు. వచ్చే ఆరు నెలల్లో సంపూర్ణ అక్షరాస్యత సాధిస్తామని పేర్కొన్నారు. సీఎస్​గా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో మండలి ఛైర్మన్​ గుత్తా సుఖేందర్​ రెడ్డి, సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.

somesh kumar
somesh kumar

By

Published : Jan 3, 2020, 3:51 PM IST

వచ్చే ఆరు నెలల్లో సంపూర్ణ అక్షరాస్యత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​ కుమార్ స్పష్టం చేశారు. సీఎస్​గా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డిని సీఎస్ మర్యాదపూర్వకంగా కలిశారు.

రాష్ట్రంలో నిరక్షరాస్యుల జాబితా సిద్ధం చేస్తున్నామని సోమేశ్ కుమార్ తెలిపారు. పంచాయతీ కార్యదర్శులకు జాబితా సిద్ధం చేయాలని ఆదేశాలు ఇచ్చామని చెప్పారు. దేశంలోని మిగతా రాష్ట్రాల్లో ఆర్థిక మాంద్యం ప్రభావం ఎక్కువగా ఉందని.. మిగతా రాష్ట్రాల కన్నా తెలంగాణ పరిస్థితి బాగానే ఉందన్నారు.

ఆర్థిక మాంద్యం ప్రభావాన్ని ఎదుర్కునేందుకు మంత్రుల కమిటీ నివేదిక సిద్ధం చేస్తోందని పేర్కొన్నారు. నివేదిక ఆధారంగా అవసరమైన చర్యలు తీసుకుంటామని సీఎస్ స్పష్టం చేసారు. పల్లె ప్రగతికి అనూహ్య స్పందన వస్తుందన్నారు.

ఆరు నెలల్లో సంపూర్ణ అక్ష్యరాస్యత సాధిస్తాం: సీఎస్​

ఇదీ చూడండి: సైబర్ క్రైం ముఠాను పట్టుకోవడం దేశంలోనే మొదటిసారి: సజ్జనార్​

ABOUT THE AUTHOR

...view details