CS on Employee Bifurcation: కొత్త జోనల్ విధానానికి అనుగుణంగా ఉద్యోగుల విభజన, కేటాయింపు ప్రక్రియను నిర్దిష్ట గడువులోగా పారదర్శకంగా పూర్తిచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ స్పష్టం చేశారు. బీఆర్కే భవన్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వివిధ శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులు పాల్గొన్నారు.
CS on Employee Bifurcation: 'ఉద్యోగుల విభజన పారదర్శకంగా పూర్తిచేయాలి' - telangana cs video conference news
CS on Employee Bifurcation: ఉద్యోగుల విభజన, కేటాయింపుపై సీఎస్ సోమేశ్‌కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విభజన, కేటాయింపు ప్రక్రియ సాఫీగా జరిగేలా పూర్తి స్థాయిలో సమన్వయం, పర్యవేక్షణ చేయాలని అధికారులు, కలెక్టర్లకు సూచించారు.
ఉద్యోగుల సీనియార్టీ జాబితాలను పూర్తి చేసిన రంగారెడ్డి, నిజామాబాద్, వరంగల్, మహబూబ్‌నగర్ కలెక్టర్లను సీఎస్ అభినందించారు. ఇతర జిల్లాల్లోనూ ఉద్యోగులందరి నుంచి ఆప్షన్స్ తీసుకొని సీనియార్టీ జాబితా పూర్తిచేయాలని సూచించారు. కేటాయింపు ప్రక్రియలో పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని, ఏ ఒక్కరినీ వదిలిపెట్టకుండా చూడాలని సీఎస్ స్పష్టం చేశారు. ఇతర శాఖల్లో డిప్యుటేషన్‌పై పనిచేస్తున్న వారిని మాతృశాఖల్లో చూపాలని సూచించారు. విభజన, కేటాయింపు ప్రక్రియ సాఫీగా జరిగేలా పూర్తి స్థాయిలో సమన్వయం, పర్యవేక్షణ చేయాలని అధికారులు, కలెక్టర్లకు సోమేశ్ కుమార్ సూచించారు.
ఇదీచూడండి:Pensions Hike in AP: పెన్షనర్లకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్